మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాబోతుంది !

మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాబోతుంది !

మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? అయితే ఆధార్ కార్డు లింక్ తప్పనిసరి కాబోతుంది !మనదేశంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారందరూ అతి త్వరలో దానితో తమ ఆధార్ కార్డ్ ని తప్పనిసరిగా లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విషయాన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తాజాగా వెల్లడించారు .
106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి వరకు వాహనాలు నడుపుతూ ,యాక్సిడెంట్లు చేసినవారు తప్పించుకొని తిరుగుతూ అవసరమైతే డూప్లికేట్ లైసెన్స్ పొందుతున్నారని డ్రైవింగ్ లైసెన్స్ తో ఆధార్ కార్డ్ లింక్ చేయడం ద్వారా దీనికి అడ్డుకట్ట వేయొచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు .ఆధార్ కార్డు లింక్ చేసిన తర్వాత మహా అయితే పేరు మార్చు కోవచ్చు. కానీ ,వారికి సంబంధించిన ఫింగర్ప్రింట్ వంటి బయోమెట్రిక్ డేటా మార్చడానికి సాధ్యపడదు కాబట్టి ,ఎవరైనా డూప్లికేట్ లైసెన్స్ పొందడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తికి ఆల్రెడీ లైసెన్స్ ఉందా లేదా అన్న విషయం వారి వేలిముద్రలను తీసుకోవడం ద్వారా వాటిని ఆధార్ డేటాబేస్ తో పోల్చడం ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు అని ఆయన అన్నారు .కచ్చితంగా ఈ ప్రక్రియ ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తున్న వారికి ఎంతోకొంత అడ్డుకట్ట వేయడానికి ఉపయోగపడుతుంది .కానీ, ఇటీవల ఆధార్ కార్డు వినియోగం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో పెట్టుకొని దేశంలోని ఇతర సర్వీసుల కి ఆధార్ ముడిపెట్టడం తగదు అని కేంద్ర ప్రభుత్వం ఎంత వరకు ఇస్తుందో వేచి చూడాలి .

రవిశంకర్ ప్రసాద్ తాజాగా చెప్పిన గణాంకాల ప్రకారం దేశ వ్యాప్తంగా 123 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి.121 కోట్ల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి 44.6 కోట్ల స్మార్ట్ఫోన్లు 56 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు .ఇండియాలో ఈ కామర్స్ రంగంలో 51 శాతం వృద్ధి సాధించినట్లు ఆయన తెలిపారు .అయితే ఇక త్వరలో మన ఆధార్ కార్డ్ ని మన డ్రైవింగ్ లైసెన్స్ తో లింక్ చేయవలసిన అవసరమైతే ఉంటుంది .

Leave a Comment