మీ గ్యాస్ సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ ఎకౌంట్లో పడుతున్నాయా లేదా మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి
చాలామంది ఎదుర్కొనే సమస్య ఇది మనం బుక్ చేయగానే గ్యాస్ అయితే వస్తుంది గాని సబ్సిడీ సక్రమంగా బ్యాంక్ ఖాతాలో పడుతుందో? లేదో? అన్న ఒక చిన్న ప్రశ్న .బ్యాంక్ అకౌంట్ కు మొబైల్ అలర్ట్ ఉన్న ఖాతాదారులకు అయితే ఓకే… కానీ చాలామంది బ్యాంక్ అకౌంట్ హోల్డర్ మొబైల్ సర్వీస్ మెయింటెన్ చెయ్యరు. అలాగే కొందరు అకౌంట్లలో సబ్సిడీ జమ అవుతూనే సడన్గా ఆగిపోవచ్చు .
అసలు ఇలా ఎందుకు జరిగిందని విషయాన్ని తెలుసుకునేందుకు మన చేతిలో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్ కు పని చెబితే సరిపోతుంది అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఏం తెలుసుకుందాం .ప్రతిసారి ఎప్పుడు పడే గ్యాస్ రాయితీ ఈసారి పడలేదు అనగానే మొదట వేరే బ్యాంక్ అకౌంట్ కు కొత్తగా ఆధార్ నెంబర్ జత చేశారేమో చూసుకోవాలి .నిత్యం వాడే ఎకౌంట్ కాకుండా ఏదైనా బ్యాంకు రుణం కోసం కొత్తగా తెరచిన ఆధార్ అనుసంధానం చేస్తున్నారు .ఆ సమాచారం నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంపీసీ ఐపోతుంది ఆటోమేటిక్గా త మారిపోతుంది .
ఆ విషయం తెలియక ఎప్పుడూ పడే ఖాతాలోనే చూసుకుంటూ ఉంటాము దాంతో సమస్య ఎదురవుతుంది అది ఏ ఖాతాలో పడుతుంది మీ మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం* 99*99# కి డయల్ చేయాలి. వెంటనే మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది. దాన్ని ఎంటర్ చేసి కన్ఫాం చేయడానికి 1 నొక్కాలి .అంతే మీ ఆధార్ నెంబర్ చూపిస్తూ అది ఏ బ్యాంకు కు అనుసంధానమై ఉందో చివరి సారి ఎప్పుడు రాయితీ పడిందో చెబుతుంది .
తెలుగులోనూ
మనం వాడేది భారత్ హెచ్పి ఇండియన్ గ్యాస్ లలో ఏదైనా సరే సమస్య వస్తే మూడింటికి కామన్ గా ఉన్న18002333555 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు ఇవ్వచ్చు
అందులో ముఖ్యంగా ఈ సమస్యలను ఫిర్యాదు చేయవచ్చు
-గ్యాస్ తూకం తగ్గిన …
-సీల్ లేకుండా వచ్చి ఇచ్చిన…
-బుక్ చేసిన నిర్ణీత సమయంలో డెలివరీ చేయకపోయినా …
-గ్యాస్ డీలర్ మోసం చేసిన ….
-వీటితోపాటు గ్యాస్ కు సంబంధించిన ఏ సమస్య వచ్చినా ఈ కాల్ సెంటర్ ను సంప్రదించవచ్చు
ఒకవేళ మీ పాత బ్యాంక్ అకౌంట్ లోనే మీ రాయితీ పడాల అనుకుంటే
కొత్తగా సబ్సిడీ పడే బ్యాంకు ఖాతాలో కాకుండా గతంలో పడే అకౌంట్లోనే పడాలి అనుకుంటే ఆ బ్యాంకుకు వెళ్లి ఒక ఆధార్ జిరాక్స్ ఇచ్చి మీ అక్కౌంట్కు అనుసంధానం చేయాలని అడగాలి .
ఒకవేళ ఇప్పటికే జతచేసి ఉందని బ్యాంకు అధికారులు చెబితే సబ్సిడీ వేరే ఖాతాకు వెళ్లిన విషయం చెప్పి NPCI సర్వీసుకు అనుసంధానం చేయాలని తెలియజేయాలి .
ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరికీ షేర్ చేయండి