Realme 2 pro మొబైల్ Bootloader Unlock చేసుకొనే పద్ధతి | 100% వర్కింగ్ ప్రోసెస్

Realme 2 pro మొబైల్ Bootloader Unlock చేసుకొనే పద్ధతి | 100% వర్కింగ్ ప్రోసెస్

Realme 2 pro మొబైల్ Bootloader Unlock చేసుకొనే పద్ధతి | 100% వర్కింగ్ ప్రోసెస్

హలో ఫ్రెండ్స్ ,అందరు ఎలా ఉన్నారు .

నేను మీ రజాక్ ,Telugutechworld.com  నుంచి ,ఈరోజు నేను మీకు Realme 2 Pro మొబైల్ లో Bootloader ని ఎలా UNLOCK చేసుకోవాలో చెప్ప బోతున్నాను .
realme official గ చెప్పింది .జనవరి 15 నుంచి  Bootloader ని Unlock చేసుకోవచ్చు అని . Realme నుంచి అప్డేట్ కూడా వచ్చేసింది, ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Realme మొబైల్ లో bootloader unlock చేయటానికి ముందుగ ఎం చేయాలో ?

Realme కమ్యూనిటీ లో క్లియర్ గ వాళ్ళు చెప్పారు. కాని, చాలా మందికి అది ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు .అందుకే నేను ఆలోచించా అందరికి అర్థం అయ్యే విధం గ తెలుగు లో post పెడితే బాగుంటది కదా అని .

ఇక ఏలనో మొదలు పెడదాం :-
ఈ ప్రాసెస్ చేసీ ముందే ఖచ్చితంగా మీ ఫోన్ లో ఉండే ఫొటోస్,వీడియోస్,మీ పర్సనల్ డేటా ని backup చేసి ఉంచుకోండి ,అంటే ఎక్కడైనా కాఫీ చేసి ఉంచుకోండి .ఎందుకు అంటే bootloader unlock చేయటం ద్వార మీ మొబైల్ లో ఉండే మొత్తం డేటా డిలీట్ అయ్యి పోతుంది .ఈ విషయాన్నీ జాగ్రత్త గ గుర్తుపెట్టుకోండి .

-ఇక మీ realme మొబైల్ యొక్క software Latest version లో అప్డేట్ అయ్యి ఉండాలి .

-తరవాత మీ realme మొబైల్ యొక్క “IMEI” నెంబర్ ని submit చేయాలి .indepth టెస్ట్ కోసం అంటే Bootloader Unlock చేసుకోవటానికి .

IMEI నెంబర్ తెలుసుకోవటానికి ముందుగ మొబైల్ యొక్క Dail pad ఓపెన్ చేసి అందులో *#06# అని dail చేయాలి .మీ ముందు మొబైల్ స్క్రీన్ మీద IMEI నెంబర్ కనిపిస్తుంది .

ఇక మీరు తరవాత స్టెప్ లో Realme ఫారంలో మీ మొబైల్ యొక్క IMEI నెంబర్ లో మొదటి నెంబర్ ని submit చేయాలి .లింక్ కింద ఉంది .
Realme bootloader unlock submit లింక్ :-  https://docs.google.com/forms/d/e/1FAIpQLScVPkSzpoEptVxyvnpXhf_3HaNGRSYFiccVv4gGkpF0hWiyRA/viewform

ఇందులో ముందు గ realme user దగ్గర  yes క్లిక్ చేయాలి .
తరవాత IMEI నెంబర్ ని ఎంటర్ చేసి submit మీద క్లిక్ చేయాలి .

ఇక మీరు ఒక 3 నుంచి 7 రోజులలో మీ ఇన్ఫర్మేషన్ ని verify చేస్తారు .తరవాత మీ మొబైల్ కి “OTA” అప్డేట్ వస్తుంది . అప్పుడు మీ మొబైల్ ని అప్డేట్ చేయాలి .

-ఇంకొక ముఖ్య విషయం మీ దగ్గర bootloader ని unlock చేయటానికి ఒక కంప్యూటర్ లేదా లాప్టాప్ ఉండాలి .ఒక వేల లేకపోతే ఎదో ఒక ఇంటర్నెట్ సెంటర్ కి అయిన వెళ్లి ఈ పని చేసుకోవచ్చు .

Unlock Steps :-

1 .ముందుగ ఒక అప్లికేషను డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషను పేరు “InDepth Test” .
డౌన్లోడ్ అప్లికేషను లింక్ :- http://bit.ly/2DzSPJT
2.డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయాలి .అందులో start applying ఆప్షన్ మీద క్లిక్ చేయాలి .


3.తర్వాత స్టెప్ లో terms & conditions కనిపిస్తాయి .అక్కడ క్లిక్ చేసి submit aplication మీద క్లిక్ చేయాలి .


4.మీకు application submitted అని కనిపిస్తుంది .


5.ఇక కింద కనిపిస్తున్న బ్యాక్ బటన్ ని క్లిక్ చేయాలి .

6.15 సెకండ్ల తరవాత మళ్ళీ InDepth Test అప్లికేషను ఓపెన్ చేయాలి .అప్లికేషను పైన ఒక ఆప్షన్ కనిపిస్తుంది ” quiery verification status” అని అక్కడ క్లిక్ చేయాలి .అక్కడ Review succesful అని కనిపిస్తుంది .అంటే మొబైల్ లో అప్లికేషను approve అయింది అని అర్థం .
కొన్ని కొన్ని సార్లు approve కావటానికి కాస్త టైం కూడా తీసుకుంది .కానీ deffinate గ approve అవుతుంది .

7.ఇక తరవాత మీ మొబైల్ లో developer option ని ON చేయాలి ఇందుకోసం మొబైల్ లో settings లోకి వెళ్లి అందులో  about phone ఆప్షన్ లోకి వెళ్లి అక్కడ version మీద 7 సార్లు క్లిక్ చేయాలి అది కుడా ఫాస్ట్ గ .

8.మొబైల్ ఓ developer ఆప్షన్ enable అవుతుంది .దీని తరవాత మొబైల్ లో settings లోకి వెళ్లి additional settings ని క్లిక్ చేసి developer option లోకి వెళ్ళాలి .

9.అందులో OEM unlock ని ON చేసుకోవాలి . తరవాత కింద మీకు USB Debugging ఆప్షన్ కనిపిస్తుంది .ఆ ఆప్షన్ ని కూడా ON చేయాలి .

 

 

 

 

 

 

 

10. ఇక మీరు కంప్యూటర్ లో ముందుగ   ADB Drivers ని ఓపెన్ చేయాలి లింక్ :-  http://adbdriver.com/

11. అక్కడ universal driver ని డౌన్లోడ్ చేసుకోవాలి .


12.ఇక మీ ఫోన్ ని కంప్యూటర్ తో కనెక్ట్ చేయాలి కేబుల్ సహాయం తో . ADB driver software ని ఓపెన్ చేయాలి . అక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేయాలి .driver ఇన్స్టాల్ అయిపోతుంది . ఇక్కడ మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ కనిపిస్తే ఈ software ఇన్స్టాల్ అయింది అని అర్థం .

13.ఇక మీరు మొబైల్ లో indepth టెస్ట్ అప్లికేషను ని ఓపెన్ చేయాలి . మీకు పైన “quiery verification status” కనిపిస్తుంది అందులోకి వెళ్ళాలి . అక్కడ కింద మీకు “start the indepth test” అని కనిపిస్తుంది .అక్కడ క్లిక్ చేయాలి .

 

 

 

 

 

 

14.అప్పుడు మొబైల్ off అవుతుంది .డైరెక్ట్ గ మొబైల్ Fastboot mode లోకి వెళ్ళిపోతుంది .

15.ఇక ఇంకొక ఫైల్ ని కంప్యూటర్ లో డౌన్లోడ్ చేసుకోవాలి . లింక్ :-  http://bit.ly/2MxADDG

16. ఆ ఫైల్ ZIP Format లో ఉంటుంది .దాని ఓపెన్ చేయాలి .ఆ ఫైల్ ని extract చేసుకోవాలి ఓపెన్ చేశాక ఇలా మీకు చాలా ఫైల్ కనిపిస్తాయి .


17.ఇక ఆ ఫోల్డర్ ఓపెన్ చేశాక మీ కంప్యూటర్ కీ బోర్డు లో “SHIFT” బటన్ ని క్లిక్ చేసి MOUSE RIGHT క్లిక్ చేయాలి .అందులో మీకు “Open command window Here ” అనే ఆప్షన్ కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయాలి .

18. ఇటువంటి command promt కనిపిస్తుంది . ఇక మొబైల్ ని కంప్యూటర్ తో కనెక్ట్ చేయాలి .ఒక 10 సెకండ్లు wait చేయాలి .

19.ఇక్కడ మీరు ముందు చెక్ చేయాలి మీ ఫోన్ కంప్యూటర్ తో కనెక్ట్ అయిందా ?లేదా? అని అందుకోసం ఒక command ఎంటర్ చేయాలి .
D:\ADB>fastboot devices   అని ఎంటర్ బటన్ క్లిక్ చేయాలి .

20.మీ మొబైల్ కనెక్ట్ అయ్యి ఉంటె మీ ఫోన్ మోడల్ అక్కడ చూపిస్తుంది .

21.ఇక తరవాత ఇంకొక command ఎంటర్ చేయాలి  “fastboot flashing Unlock” అని ఎంటర్ క్లిక్ చేయాలి . ఇలా మీకు మెసేజ్ కనిపిస్తుంది .

22.ఇక మీ మొబైల్ ఇలా ఒక ఇంటర్ పేస్ కనిపిస్తుంది . ఇక మీ మొబైల్ లో “volume down” బటన్ ని క్లిక్ చేసి  “unlock the bootloader” అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి.

23.సెలెక్ట్ చేయటం కోసం power off బటన్ ని క్లిక్ చేయాలి .ఇక మీ మొబైల్ bootloader unlock కావటం start అవుతుంది .మీ మొబైల్ లోని డేటా మొత్తం డిలీట్ అవుతుంది .తరవాత automatic గ మొబైల్ ON అవుతుంది .

24.మొబైల్ ని సెటప్ చేసుకోమని అడుగుతుంది .మొత్తం మీ details ఎంటర్ చేసి మొబైల్ ని సెట్ అప్ చేసుకోవాలి .

 

 

 

 

 

 

 

 

25.ఇక మీరు మొబైల్ ని సెటప్ చేసుకున్నాక మొబైల్ లో settings ఆప్షన్ లోకి వెళ్లి  about phone option లోకి వెళ్లి version మీద” 7 “సార్లు క్లిక్ చేయాలి .”developer option enable”అవుతుంది .

26.ఇక మీరు developer ఆప్షన్ లోకి వెళ్లి  “OEM UNLOCK ” ఇలా మీకు కనిపిస్తుంది .అంటే ఇలా మీరు bootloader unlock చేసుకున్నాక ఈ ఆప్షన్ ని on చేయలేము అలా అని off కూడా చేయలేము .


27.దీనికి అర్థం మీ మొబైల్ యొక్క “BOOTLOADER ” successfully Unlock అయింది అని.

ఇలా మీరు ఈ మొత్తం ప్రాసెస్ ని ఫాలో అయ్యి చాలా సులభం గ Realme 2 ప్రో మొబైల్ యొక్క bootloader ని unlock చేసుకోవచ్చు .

-ఈ post మీకు ఉపయోగపడింది అని ఆశిస్తున్నాను .నచ్చితే facebook ,whatsapp లో షేర్ చేయండి .మీ సలహాలు ,ప్రశ్నలు ఉంటె కామెంట్ లో అడగగలరు .

1 thought on “Realme 2 pro మొబైల్ Bootloader Unlock చేసుకొనే పద్ధతి | 100% వర్కింగ్ ప్రోసెస్”

Leave a Comment