మెసేజ్ లో వచ్చిన లింక్ క్లిక్ చేయగానే 50,000 గోవిందా ? కాస్త జాగ్రత్త …

 

ప్రస్తుత్తం ఇండియా లో సైబర్ నేరగాళ్లు ఎక్కువ అయ్యారు . టెక్నాలజీ ని ఆధారంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు బాగా రెచ్చిపోతున్నారు .ఈ సైబర్ మోసాలు అధికం అవ్వటం తో ఆన్లైన్ లో లావాదేవీలు జరపాలి అంటే చాలా మంది భయపడి ఆలోచనలో పడుతున్నారు . దాదాపు 23 శాతం మంది భారతీయ వినియోగదారులు ఆన్లైన్ మోసాల  బారిన పడుతున్నారు అని ఓకే రిపోర్ట్ వెల్లడైయింది .వీటికి తోడు సైబర్ నేరగాళ్లు జనాన్ని మోసం చేయటం లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు .ఇప్పటికే బ్యాంక్ అకౌంట్స్ హాక్ చేయటం ,క్రెడిట్,డెబిట్ కార్డ్స్ క్లోనింగ్ చేయటం వంటివి జనాలను భయపెడ్తున్నాయి . ఈ నేపధ్యం లో మరో మోసం బయట పడింది . గురుగ్రామ్ లో ఒక వ్యక్తికి ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేరు తో ఓ మెసేజ్ వచ్చింది ఏంటి ఈ మెసేజ్ అని ఓపెన్ చేసి లింక్ క్లిక్ చేశాడు .ప్రొద్దున్న అయ్యే సరికి చూస్తే అకౌంట్ నుంచి రూ . 50,000 మాయం అయ్యాయి .పూర్తీవివరాలలోకివెళ్తే….

మొబైల్ కి ఇన్ కామ్ ట్యాక్స్ పేరు తో మెసేజ్ వచ్చింది ….

గురుగ్రామ్ లో నివసించే హరీష్ చందర్ వృత్తి రీత్యా వ్యాపారం చేస్తూ ఉంటాడు .అయితే తన ఫోన్ కి ఇన్ కమ్ ట్యాక్స్ పేరు తో ఓ మెసేజ్ వచ్చింది .మీ ఇన్ కమ్ ట్యాక్స్ పెండింగ్ల్ ఉంది అని ఆ మెసేజ్ లో స్పష్టం గ కనిపించింది . ఆమెసేజ్లోఒకలింక్కూడాకనిపించింది

లింక్ క్లిక్ చేశాడు

నిజంగానే ఐటీ డిపార్ట్మెంట్ పంపిన మెసేజ్ అనుకోని లింక్ క్లిక్ చేశాడు .లింక్ క్లిక్ చేయగానే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ అయింది తన మొబైల్ లో .ఇక ప్రొద్దున లేచి చూసే సరికి అకౌంట్ నుంచి రూ . 50 వేలు మాయం అయ్యాయి .

వెంటనే పోలీసుల ను ఆశ్రయించాడు

ఒక్క సారిగ షాక్ అయిన హరీష్ చందర్ వెంటనే పోలీసులను ఆశ్రయించాడు .అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు .

ఇక మీ మొబైల్ కి కూడా ఇటువంటి మెసేజ్ వచ్చినప్పుడు కాస్త జాగ్రత్త వహించండి .లేకపోతె మీ అకౌంట్ నుంచి కూడా డబ్బు మాయం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆన్లైన్ మోసాలను అరికట్టటానికి ఈ టిప్స్ ను ఖచ్చతంగా పాటించండి ….

సెక్యూరిటీ సాఫ్ట్వెర్ ని లేటెస్ట్ గ ఉంచుకోండి . ఇంటర్నెట్ అంటేనే వైరస్ తో కూడిన మాల్వేర్ స్పామ్ ,స్పైవెర్ అని పిలవబడే విరుసులు కంప్యూటర్ను నాశనం చేయటమే కాకా వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తాయి .అందుకే ఎప్పటికప్పుడు లేటెస్ట్ సెక్యూరిటీ సాఫ్ట్వేరుతో పాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్ చేసుకోవాలి .

పాస్వర్డ్ విషయంలో చాలా జాగ్రత్త

సింపుల్ పాస్వర్డ్ ఎప్పుడు పెట్టుకోకూడదు .అప్పర్ ,లోయర్ కేస్లతో పటు నంబర్లు ,సింబల్స్ జోడించి సురక్షితం .ఒక్కటే పాస్వర్డ్ అన్నిటికి ఉంచటం కాకుండా ప్రతి దానికి  విభిన్నంగ పాస్వర్డ్ ని ఎంచుకోండి .పాస్వర్డ్ ను సేవ్ బ్రౌసర్ లో సేవ్ చేయకపోవటం ఉత్తమం .

తెలియని ఈ మెయిల్స్ జోలికి అస్సలు వెళ్లొద్దు ….

కాన్ఫిడెన్షియల్ సమాచారం అడిగే ఈ మెయిల్స్ జోలికి అస్సలు వెళ్లొద్దు .పేమెంట్ కంపెనీ లు ఎప్పటికి మీ వ్యక్తిగత చెల్లింపు సమాచారాన్ని అడిగావు .మీకు నమ్మకం లేని ఈ మెయిల్స్ ను అసలు తెరవొద్దు .తెలియని లింక్ల మీద క్లిక్ చేయకండి .

ఫ్రీ వైఫై అస్సలు వాడకండి ….

ఉచితంగ వచ్చే వైఫై టెర్మినల్స్ వాడకపోవడం మంచిది .అలాగే పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షన్ తో పాస్వర్డ్ అప్డేట్ చేయవద్దు .బ్యాంకింగ్ లావాదేవీలు చేసేటప్పుడు ఒరిజినల్ బ్యాంకింగ్ యాప్స్ ని మాత్రమే వినియోగించండి .

నమ్మకమైన వాటి నుంచి డౌన్లొడ్చేయండి…

ఆన్లైన్ లో ఫ్రీ గ వస్తున్నాయి అని కాకుండా ,నమ్మకమైన సోర్స్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి .యాడ్ బ్లాకింగ్ సాఫ్ట్వేర్ తో పటు స్పై వెర్ డిటెక్షన్ ప్రోగ్రామ్ను రన్ చేయడం వాళ్ళ ఆన్లైన్ మోసాలు భారిన పడకుండా కాపాడుకోవచ్చు ,

ఒకే క్రెడిట్ కార్డు/డెబిట్ కార్డు వినియోగించటడం వల్ల

ఆన్లైన్ లో ఒకే డెబిట్ /క్రెడిట్ కార్డు వినియోగించటం వాళ్ళ నష్టపోయే అవకాశాలు చాలా తక్కువ .ఆన్లైన్లో షాపింగ్ చేసిన వెంటనే మీ బ్యాంక్ ,క్రెడిట్,డెబిట్ కార్డు మరియు మర్చంట్ సైట్ల  నుంచి తప్పనిసరిగా లాగౌట్ అవ్వాలి.మీ కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ లో బ్యాంకుల పిన్ లేదా పస్స్వర్డ్స్ సేవ్ చేయకండి .   

Leave a Comment