కేసీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు..!

 

KCR Vijayashanti  Sit                                                                                       తెలుగు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన డేటా చోరీ కేసులో నిజానిజాలను తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే .అయితే తాజాగా ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేత, నటి విజయశాంతి ట్విట్టర్ ద్వారా స్పందించారు .సీట్ ఏర్పాటు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆమె విమర్శలు గుప్పించారు .ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సీట్ ద్వారా విచారణకు ఆదేశించడం వింతగా ఉందని వ్యాఖ్యానించారు .ఐటీ గ్రిడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి ఓటర్ల జాబితాను తారుమారు చేస్తారన్న ఆరోపణలపై తెలంగాణ పోలీసులు కేసులు పెడ్తున్నారు అంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు .  .

పొరుగు రాష్ట్రానికి సంబంధించిన ఈ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సిట్  ద్వారా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు .తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజయశాంతి గుర్తు చేశారు .

పొరుగు రాష్ట్రం లో జరిగే అన్యాయానికి అయితే సిట్కె వేస్తారా … అదే తెలంగాణా లో జరిగితే సిట్ (కూర్చోండి )అంటూ ప్రతి పక్షాల గొంతు నొక్కుతారని ఆమె ధ్వజమెత్తింది . కేసిఆర్  కోరుకుంటున్న ఫెడరల్ వ్యవస్థ అంటే ఇలాగే ఉంటుందేమో నని విజయశాంతి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

.డేటా చోరీ వ్యవహారంపై వైసిపి అధినేత జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గవర్నర్ నరసింహన్ను కలిసిన వెంటనే సీట్ ఏర్పాటు చేయడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆమె ఆరోపించారు .మోదీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతుందన్న వాదనలకు ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి అన్న విజయశాంతి ఒకరకంగా చెప్పాలంటే కెసిఆర్ గారి ఫెడరల్ ఫ్రంట్ ముసుగు తొలిగిపోయి బిజెపి కోసం అని తెలిసి పోతుందని విమర్శించారు .

Leave a Comment