BSNL Recruitment 2025 : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెలికాం మరియు ఫైనాన్స్ స్ట్రీమ్స్ లలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేద. తేదీలో త్వరలో ప్రకటిస్తారు. ఉద్యోగాల కోసం ప్రీపేర్ అయ్యే వారు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించండి.

ఖాళీల వివరాలు :
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) టెలికాం మరియు ఫైనాన్స్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
| పోస్టుల పేరు | ఖాళీల సంఖ్య |
| టెలికాం | 95 |
| ఫైనాన్స్ | 25 |
| మొత్తం | 120 |
Also Read : National Sanskrit University Tirupati Recruitment 2025 | తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ జాబ్స్
అర్హతలు :
BSNL Recruitment 2025 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టు స్ట్రీమ్ ని బట్టి విద్యార్హతలు మారుతాయి.
- టెలికాం : సంబంధిత విభాగాల్లో కనీసం 60% మార్కులతో BE / B.Tech ఉత్తీర్ణత
- ఫైనాన్స్ : CA / CMA ఉండాలి.
వయోపరిమితి :
BSNL Recruitment 2025 అభ్యర్థులకు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ :
BSNL Recruitment 2025 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
BSNL Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు E3 IDA పే స్కేల్ ప్రకారం రూ.24,900/- నుంచి రూ.50,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
BSNL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి. ఆన్ లైన్ అప్లయ్ పోర్టల్ త్వరలో అధికారిక వెబ్ సైట్ లో యాక్టివేట్ అవుతుంది.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన్ అప్లయ్ తేదీలు త్వరలో ప్రకటించడం జరుగుతుంది.
Notification – Click here
Also Read : CSIR NBRI MTS Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో MTS జాబ్స్






