NHAI Recruitment 2025 : రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) నుంచి ఉద్యోగల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ మరియు స్టెనోగ్రాఫర్ తో సహా గ్రూప్ A, B&C పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 84 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 84
గ్రూప్ ‘A’ పోస్టులు :
- డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) : 9
గ్రూప్ ‘B’ పోస్టులు :
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : 1
- జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ : 1
గ్రూప్ ‘C’ పోస్టులు :
- అకౌంటెంట్ : 42
- స్టెనోగ్రాఫర్ : 31
Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు
అర్హతలు :
NHAI Recruitment 2025 పోస్టులను బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి.
- డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి MBA (Finance) రెగ్యులర్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.
- లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ : Bachelor in Library Science
- జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ : హిందీ లేదా ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీతో పాటు హిందీ–ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో సర్టిఫికేట్/డిప్లొమా లేదా 2 సంవత్సరాల అనుభవం.
- అకౌంటెంట్ : Intermediate CA లేదా CMA + బ్యాచిలర్ డిగ్రీ
- స్టెనోగ్రాఫర్ : డిగ్రీ (Bachelor’s Degree) + షార్ట్‌హ్యాండ్ స్పీడ్ 80 wpm (ఇంగ్లీష్/హిందీ) + ట్రాన్స్క్రిప్షన్ టైం: ఇంగ్లీష్ 50 నిమిషాలు / హిందీ 65 నిమిషాలు
వయోపరిమితి :
NHAI Recruitment 2025 డిప్యూటీ మేనేజర్(ఫైనాన్స్ అండ్ అకౌంట్స్), లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, అకౌంటెంట్ పోస్టులకు 30 సంవత్సరాలు, స్టెనోగ్రాఫర్ పోస్టులకు 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NHAI Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
| వర్గం | ఫీజు |
| UR / OBC / EWS | ₹500/- |
| SC / ST / PwBD | ఫీజు లేదు |
ఎంపిక ప్రక్రియ :
NHAI Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- Deputy Manager (F&A): CBT + ఇంటర్వ్యూ
- Library Assistant, JTO, Accountant: CBT మాత్రమే
- Stenographer: CBT + స్కిల్ టెస్ట్
CBT పరీక్షలో
- మొత్తం 120 ప్రశ్నలు – 120 మార్కులు
- ప్రతీ తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గింపు
- కనీస అర్హత మార్కులు:
- UR – 40%
- OBC/EWS – 35%
- SC/ST/PwBD – 30%
Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
NHAI Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Deputy Manager: ₹56,100 – ₹1,77,500/-
- Library Assistant / JTO: ₹35,400 – ₹1,12,400/-
- Accountant: ₹29,200 – ₹92,300/-
- Stenographer: ₹25,500 – ₹81,100/-
దరఖాస్తు విధానం :
NHAI Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ https://nhai.gov.in కి వెళ్లండి.
- Online Registration ట్యాబ్ పై క్లిక్ చేయండి.
- సరైన వివరాలు (పేరు, DOB, మొబైల్ నంబర్, ఈమెయిల్) నమోదు చేయండి.
- అవసరమైన పత్రాలు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి, అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించండి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 15 డిసెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : CSIR NBRI MTS Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో MTS జాబ్స్






