RGNAU Professional Trainee Recruitment 2025 : భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించిన అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (RGNAU) నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో ప్రొఫెషనల్ ట్రైనీ (Professional Trainee) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈమెయిల్ ద్వాారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:
- పోస్ట్ పేరు: ప్రొఫెషనల్ ట్రైనీ (Professional Trainee)
- విభాగం: ఫైనాన్స్ & అకౌంట్స్
- మొత్తం ఖాళీలు: 2
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు
అర్హతలు :
RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
- అలాగే CA / CMA (ICWA) కోర్సులో ఇంటర్మీడియట్ లెవల్ (Semi-qualified) పూర్తి చేసి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి:
RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి.
స్టైపెండ్ :
RGNAU Professional Trainee Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది.
- మొదటి సంవత్సరం: ₹20,000/- ప్రతినెల
- రెండో సంవత్సరం : ₹22,000/- ప్రతినెల
- హాస్టల్ లేదా షేర్డ్ అకామడేషన్ (₹500/- నెలకు) చెల్లించి పొందవచ్చు.
- మెడికల్ ఫెసిలిటీ: యూనివర్సిటీ విద్యార్థుల మాదిరిగా OPD వైద్య సదుపాయం ఉంటుంది.
శిక్షణ కాలం :
- మొదట 1 సంవత్సరం కాలానికి నియామకం ఉంటుంది.
- అవసరమైతే మరో 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు. (గరిష్టం 2 సంవత్సరాలు)
- ప్రతి పూర్తి చేసిన నెలకు 1 రోజు సెలవు లభిస్తుంది.
Also Read : NHAI Recruitment 2025 | నేషనల్ హైవేస్ లో బంపర్ జాబ్స్
ఎంపిక విధానం :
RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
- దరఖాస్తు స్క్రీనింగ్ : సమర్పించిన అప్లికేషన్లు మరియు డాక్యుమెంట్స్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలుస్తారు. వివరాలు ఈమెయిల్ ద్వారా పంపిస్తారు.
- తుది ఎంపిక ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు విధానం:
RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి.
- అభ్యర్థులు RGNAU అధికారిక వెబ్సైట్ www.rgnau.ac.in లోకి వెళ్లాలి.
- అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అటాచ్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్ మరియు అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి ఒకే PDF ఫైల్‌గా స్కాన్ చేయాలి.
- ఆ PDF ఫైల్‌ను ఈమెయిల్ ద్వారా పంపాలి: pt.recruit@rgnau.ac.in
- హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు.
- ఇంటర్వ్యూకి పిలుపు వచ్చినప్పుడు అసలు సర్టిఫికేట్లు చూపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 30 నవంబర్ 2025
| Notification | Click here |
| Official Website | Click here |
Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు






