Indian Bank Fire Safety Officer Jobs 2025 | ఇండియన్ బ్యాంక్ లో ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్

On: November 5, 2025
Indian Bank Fire Safety Officer Jobs 2025

Indian Bank Fire Safety Officer Jobs 2025 :  భారత ప్రభుత్వానికి చెందిన ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన ఇండియన్ బ్యాంక్ నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ముఖ్యంగా బ్యాంక్ భవనాలు, బ్రాంచ్‌లు, అధిక అంతస్తుల భవనాలలో ఫైర్ సేఫ్టీ వ్యవస్థలను పరిశీలించడం మరియు భద్రతా నియమాలు అమలు చేయడంపై ఆధారపడినవి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 21వ తేదీ వరకు ఆఫీ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

Indian Bank Fire Safety Officer Jobs 2025
Indian Bank Fire Safety Officer Jobs 2025

ఖాళీల వివరాలు : 

ఇండియన్ బ్యాంక్ నుంచి ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రిజర్వేషన్ మరియు ఖాళీలు బ్యాంక్ అవసరం ప్రకారం మారవచ్చు. 

  • పోస్టు పేరు :  ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ (అసోసియేట్ మేనేజర్ / సీనియర్ ఆఫీసర్) 
  • పోస్టుల సంఖ్య : 6

Also Read : Punjab & Sind Bank Recruitment 2025 | MSME రిలేషన్ షిప్ మేనేజర్ జాబ్స్

అర్హతలు: 

Indian Bank Fire Safety Officer Jobs 2025 అభ్యర్థులకు కింది విద్యార్హతల్లో ఏదో ఒకటి ఉండాలి. 

  • National Fire Services College, నాగ్ పూర్ నుంచి BE(Fire) (లేదా) Fire Engineering / Fire Technology / Safety & Fire Engineering లో 4 సంవత్సరాల డిగ్రీ (లేదా) National Fire Service College నాగ్ పూర్ నుంచి బ్యాచిలర్ డిగ్రీ
  • కనీసం 3 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. 

వయోపరిమితి : 

Indian Bank Fire Safety Officer Jobs 2025 అభ్యర్థులకు 23 సంవత్సరాల నుచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

Indian Bank Fire Safety Officer Jobs 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

వర్గంఫీజు
SC / ST / PwBD₹175 (GST సహా)
ఇతర వర్గాలు₹1000 (GST సహా)

ఎంపిక ప్రక్రియ: 

Indian Bank Fire Safety Officer Jobs 2025 అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న తర్వాత మొదటి అప్లికేషన్ స్క్రీనింగ్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. తర్వాత వారికి ఇంటర్వ్యూ చేసి పోస్టింగ్ ఇస్తారు. అభ్యర్థులు ఎక్కువైతే పరీక్ష లేదా గ్రూప్ డిస్కషన్ కూడా నిర్వహించవచ్చు. 

Also Read : NABARD Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ పోస్టులు

Also Visit Pdf Tools Website : ezipdf.com

జీతం వివరాలు: 

Indian Bank Fire Safety Officer Jobs 2025 అభ్యర్థులకు ఇంటర్వ్యూలో డిస్కషన్ ఆధారంగా జీతం ఇవ్వడం జరుగుతుది. ఎంపికైన అభ్యర్థులకు Mumbai, Delhi, Kolkata, Coimbatore, Lucknow, Bengaluru లేదా బ్యాంక్ నిర్ణయించిన ఇతర నగరాల్లో పోస్టింగ్ ఇస్తారు.  

దరఖాస్తు విధానం : 

Indian Bank Fire Safety Officer Jobs 2025 ఈ పోస్టులకు ఆన్ లైన్ అప్లికేషన్ లేదు. అభ్యర్థులు పోస్టు ద్వారా అప్లికేషన్ పంపాలి. ముందుగా నోటిఫికేషన్ లో ఇచ్చిన అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. కావాలసిన సర్టిఫికెట్లు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీగా జత చేయాలి. ఎన్వలప్ పై “Application for the post of Fire Safety Officer on Contractual Basis – 2025” అని రాయాలి. 

దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ : 

  • Chief General Manager (CDO & CLO),Indian Bank, Corporate Office, HRM Department, Recruitment Section, 254-260, Avvai Shanmugam Salai, Royapettah, Chennai – 600014.

దరఖాస్తులకు చివరి తేదీ : 21 నవంబర్ 2025 లోగా దరఖాస్తు తప్పనిసరిగా చేరాలి.

NotificationClick here
Application FormClick here

Also Read : PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

Leave a Comment

Follow Google News