AgHub Recruitment 2025 | రూరల్ కోఆర్డినేటర్ జాబ్స్

On: November 5, 2025
AgHub Recruitment 2025

AgHub Recruitment 2025 : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ వ్యాపారాలు, స్టార్టప్‌లు, మరియు రైతు ఔత్సాహికతను ప్రోత్సహించేందుకు AgHub Foundation (Professor Jayashankar Telangana State Agricultural University – PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్) నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

AgHub Recruitment 2025
AgHub Recruitment 2025

ఖాళీల వివరాలు: 

పోస్టు పేరుప్రాంతంఖాళీలు
Rural Coordinatorజగిత్యాల01
Rural Coordinatorటాండూర్01
మొత్తం ఖాళీలు: 02

Also Read : IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్

అర్హతలు: 

AgHub Recruitment 2025 అభ్యర్థులు B.Sc Agriculture లేదా సంబంధించిన Agriculture Allied Sciencesలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు గ్రామీణ వ్యాపారాలు / గ్రామీణ స్టార్టప్ అభివృద్ధిలో ఆసక్తి, స్టార్టప్ ఎకోసిస్టం, గ్రామీణ వ్యాపారులతో పనిచేయగల సామర్థ్యం, Computer & Office Management లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. Development / NGO / Incubator లో మునుపటి అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇస్తారు. 

వయోపరిమితి : 

AgHub Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

అప్లికేషన్ ఫీజు : 

AgHub Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ: 

AgHub Recruitment 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

Also Read : CCRH Recruitment 2025 | ఆయూష్ మంత్రిత్వ శాఖలో గ్రూప్ A, B & C పోస్టులు

జీతం వివరాలు : 

AgHub Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. 

పని విధులు :

  • గ్రామీణ ప్రాంతాల్లో స్టార్టప్ & వ్యాపార శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం.
  • రైతు-ఔత్సాహికులను గుర్తించి, మార్గదర్శకత్వం కల్పించడం.
  • రోజువారీ కార్యకలాపాలు & ఫైల్ రికార్డులు నిర్వహించడం.
  • మెంటర్లు, నిపుణులు, బిజినెస్ టీమ్లతో సమన్వయం చేయడం.
  • ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు, శిక్షణ క్యాంపులు నిర్వహించడం

దరఖాస్తు విధానం : 

AgHub Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 

ఇంటర్వ్యూ తేదీలు : 

  • 21 నవంబర్, 2025 మధ్యాహ్నం 2.30 గంటలకు
  • వేదిక : AgHub, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్

అవసరమైన పత్రాలు : 

  • తాజా రెజ్యూమే
  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • అసలు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు మరియు ఫోటోకాపీలు

Notification : Click here

Official Website : Click here

Also read : CSIR–NIO Recruitment 2025 | NIOలో బంపర్ నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News