NABARD Assistant Manager Grade A Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన NABARD (National Bank for Agriculture and Rural Development) సంస్థలో Assistant Manager Grade ‘A’ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు బ్యాంకింగ్, వ్యవసాయం మరియు గ్రామీణ అభివృద్ధి రంగం పై ఆసక్తి ఉన్న యువతకు మంచి అవకాశం. దరఖాస్తులు 08 నవంబర్ 2025 నుండి 30 నవంబర్ 2025 వరకూ స్వీకరించబడతాయి. ఎంపిక Prelims, Mains, Psychometric Test మరియు ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.

ఖాళీల వివరాలు
ఈ నియామకాల్లో మొత్తం 91 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులు మూడు విభాగాలుగా ఉన్నాయి:
| విభాగం | పోస్టు పేరు | ఖాళీలు |
| I | అసిస్టెంట్ మేనేజర్ (RDBS – General + ప్రత్యేక విభాగాలు) | 85 |
| II | అసిస్టెంట్ మేనేజర్ (Legal) | 2 |
| III | అసిస్టెంట్ మేనేజర్ (Protocol & Security) | 4 |
| మొత్తం | 91 |
Also Read : MSJE PMU Recruitment 2025 | Apply Online for 49 State Coordinator Posts
అర్హతలు
NABARD Assistant Manager Grade A Recruitment 2025 పోస్ట్ ప్రకారం అర్హతలు వేరుగా ఉన్నాయి.
- RDBS (General): ఏదైనా డిగ్రీలో 60% మార్కులు (SC/ST/PwBD కు 55%) లేదా PG/ MBA/ CA/ Ph.D ఉండాలి.
- లీగల్: LLB తో 60% లేదా LLM తో 55% మార్కులు.
- ప్రొటోకాల్ & సెక్యూరిటీ: Army / Navy / Airforce లో కనీసం 10 సంవత్సరాల కమిషన్డ్ సర్వీస్.
వయోపరిమితి
- RDBS & Legal: 21 నుండి 30 సంవత్సరాలు
- Protocol & Security: 25 నుండి 40 సంవత్సరాలు
- SC/ST/OBC/PWBD వర్గాలకు వయో సడలింపు రూల్స్ ప్రకారం ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
NABARD Assistant Manager Grade A Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
| కేటగిరీ | ఫీజు |
| SC / ST / PwBD | ₹150 |
| ఇతర అభ్యర్థులు | ₹850 |
ఎంపిక విధానం
NABARD Assistant Manager Grade A Recruitment 2025 పోస్టులక అభ్యర్థుల ఎంపిక 4 దశల్లో జరుగుతుంది:
- Prelims Exam (ఆన్‌లైన్)
- Mains Exam (ఆన్‌లైన్ + వివరణాత్మక ప్రశ్నలు)
- Psychometric Test
- Interview (50 మార్కులు)
Prelims కేవలం క్వాలిఫయింగ్, Mains + Interview మార్కుల ఆధారంగా ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
Also Read : NPCIL Recruitment 2025 | Salary up to ₹86,000 per Month | Apply Online
జీతం వివరాలు
- ప్రారంభ బేసిక్ పే: ₹44,500/-
- అలవెన్సులు కలిపి నెలకు సుమారు ₹1,00,000/- వరకు వేతనం ఉంటుంది.
ఇంకా హౌస్ రెంట్, మెడికల్, ట్రావెల్, హోమ్ లోన్, కార్ లోన్ వంటి అనేక ప్రయోజనాలు అందించబడతాయి.
దరఖాస్తు విధానం
దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ లో మాత్రమే చేయాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.nabard.org ని సందర్శించాలి.
- Careers → Apply Online పై క్లిక్ చేయండి.
- రిజిస్ట్రేషన్ చేసి Login అవ్వండి.
- వివరాలు నమోదు చేసి, ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేయండి.
- ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
| కార్యక్రమం | తేదీలు |
| దరఖాస్తుల ప్రారంభం | 08 నవంబర్ 2025 |
| చివరి తేదీ | 30 నవంబర్ 2025 |
| Prelims పరీక్ష | 20 డిసెంబర్ 2025 |
| Mains పరీక్ష | 25 జనవరి 2026 |
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RRB NTPC & JE Recruitment 2025 | రైల్వేలో 11,429 ఉద్యోగాలు – అప్లయ్ చేశారా?






