Ordnance Factory Medak Recruitment 2025 | మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కాంట్రాక్ట్ జాబ్స్ 

On: November 10, 2025
OFMK Recruitment 2025

OFMK Recruitment 2025 : రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్న Armoured Vehicles Nigam Limited (AVNL) లోని Ordnance Factory Medak, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో పనిచేయడానికి పలు Junior Manager & Senior Manager పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవి Fixed Term Contract ఆధారంగా భర్తీ చేయబడతాయి. ఇంజినీరింగ్ పూర్తి చేసిన వారికి ఇది మంచి అవకాశం. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చిన తేదీ నుంచి 21 రోజుల వరకు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

OFMK Recruitment 2025
OFMK Recruitment 2025

ఖాళీల వివరాలు: 

ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ మేనేజర్ మరియు జూనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 16 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

  • సీనియర్ మేనేజర్ (ఆర్మర్) – 01
  • జూనియర్ మేనేజర్ (మెకానికల్) (HF) – 01 
  • జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రానిక్స్) (PA) – 01
  • జూనియర్ మేనేజర్ (కంప్యూటర్ సైన్స్ / ఐటీ) (NQ) – 02
  • జూనియర్ మేనేజర్ (మెకానికల్) (S) – 02 
  • జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) (S) – 01 
  • జూనియర్ మేనేజర్ (మెటలర్జీ) (S) – 01 
  • జూనియర్ మేనేజర్ (CAD స్పెషలిస్ట్) (S) – 01 
  • జూనియర్ మేనేజర్ (మెకానికల్) (P) – 04 
  • జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) (P) – 01 
  • జూనియర్ మేనేజర్ (CAD స్పెషలిస్ట్) (P) – 01 

Also Read : NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

అర్హతలు : 

OFMK Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగంలో బీఈ /బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • సీనియర్ మేనేజర్ : మెటలర్జీ / మెకానికల్ / అప్లైడ్ మెకానిక్స్ లో BE / B.Tech + సంబంధిత విభాగంలో PG / PhD
  • జూనియర్ మేనేజర్ : మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సీఎస్/ఐటీ, మెటలర్జీ BE / B.Tech / MCA / MSc + సంబంధిత విభాగంలో కనీసం 1 సంవత్సరం అనుభవం

వయోపరిమితి: 

  • జూనియర్ మేనేజర్ పోస్టులకు: 21 నుండి 30 సంవత్సరాల మధ్య
  • సీనియర్ మేనేజర్ పోస్టుకు: గరిష్టం 45 సంవత్సరాలు
  • నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

  • జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు : రూ.300/-
  • SC/ST/PwD/Ex-SM/మహిళలకు ఫీజు లేదు.
  • SBI Collect ద్వారా చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ: 

  • ఎంపిక దరఖాస్తు స్క్రీనింగ్ + ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
  • కంపెనీకి అవసరమైతే మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్టింగ్ చేస్తారు.

Also Read : BEML Junior Executive Recruitment 2025: Apply for Mechanical, Electrical & Electronics Posts

జీతం వివరాలు : 

  • Junior Manager పోస్టులకు: ₹30,000/- + IDA
  • Senior Manager పోస్టుకు: ₹70,000/- + IDA

దరఖాస్తు విధానం : 

అభ్యర్థులు ఆఫ్ లైన్ లో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి. నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకొని వివరాలు నింపాలి. అవసరమైన పత్రాలు జత చేసి, అప్లికేషన్ ఫీజు చెల్లించి, కింది చిరునామాకు పంపాలి. 

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:

The Deputy General Manager (HR),
Ordnance Factory Medak, Yeddumailaram,
Sangareddy District, Telangana – 502205.

  • కవరుపై పోస్ట్ పేరు & Advertisement No తప్పనిసరిగా రాయాలి.
  • హ్యాండ్-సబ్మిషన్ అనుమతి లేదు. కేవలం Speed Post ద్వారా మాత్రమే.

దరఖాస్తులకు చివరి తేదీ : 

ఈ నోటిఫికేషన్ Employment Newspaper ప్రచురణ తేదీ నుండి 21 రోజులు లోపు దరఖాస్తు పంపాలి.

Notification & Application : Click here

Official Website : Click here

Also Read : NPCIL Recruitment 2025 | Salary up to ₹86,000 per Month | Apply Online

Leave a Comment

Follow Google News