Customs Marine Wing Recruitment 2025 : కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్, కోచ్చి లోని మెరైన్ వింగ్ లో Group-C Non-Gazetted ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సముద్ర ప్రయాణ అనుభవం, ITI మరియు 10వ తరగతి అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది మంచి ఉద్యోగ అవకాశం. ఎంపిక రాత పరీక్ష + ఫిజికల్ స్విమ్మింగ్ టెస్ట్ + మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలి.

ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా క్రింది పోస్టులు భర్తీ చేయబడనున్నాయి. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- ట్రేడ్స్ మెన్ : 3
- సీమ్యాన్ : 11
- గ్రీసర్ : 4
- సీనియర్ స్టోర్ కీపర్ : 1
Also Read : HCL Junior Manager Recruitment 2025 | హిందూస్తాన్ కాపర్ లిమిటెడ్ లో బంపర్ జాబ్స్
అర్హతలు
Customs Marine Wing Recruitment 2025 పోస్టులను బట్టి విద్యార్హతలు కింది విధంగా ఉంటాయి.
1) Tradesman
- 10th Class ఉత్తీర్ణత
- ITI in Mechanic/Diesel/Fitter/Turner/Welder/Electrician/Carpentry మొదలైన విభాగాలలో
- కనీసం 2 సంవత్సరాల అనుభవం వర్క్‌షాప్ / షిప్ రిపేర్ / మెషిన్ మెయింటెనెన్స్‌లో
2) Seaman
- 10th Class ఉత్తీర్ణత
- కనీసం 3 సంవత్సరాలు సముద్ర నడిచే నౌకలో పనిచేసిన అనుభవం
- హెల్మ్స్మెన్ / సీమాన్ షిప్ హ్యాండ్లింగ్ పనిలో అనుభవం
3) Greaser
- 10th Class ఉత్తీర్ణత
- నౌకలపై మెయిన్ & ఆక్సిలరీ మెషినరీ మెయింటెనెన్స్ లో 3 సంవత్సరాల అనుభవం
4) Senior Store Keeper
- 10th Class ఉత్తీర్ణత
- స్టోర్ / గిడ్డంగి / మెటీరియల్ హ్యాండ్లింగ్ లో కనీసం 8 సంవత్సరాల అనుభవం
వయోపరిమితి
| పోస్టు | వయస్సు పరిమితి |
| Tradesman | గరిష్టం 25 సంవత్సరాలు |
| Seaman | 18 నుండి 25 సంవత్సరాలు |
| Greaser | 18 నుండి 25 సంవత్సరాలు |
| Senior Store Keeper | గరిష్టం 30 సంవత్సరాలు |
రిజర్వేషన్/వయస్సు రీలాక్సేషన్
- SC/ST – 5 సంవత్సరాలు
- OBC – 3 సంవత్సరాలు
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు – గరిష్టంగా 35 సంవత్సరాల వరకు
ఎంపిక విధానం
ఎంపిక క్రింది దశల ద్వారా జరుగుతుంది:
- రాత పరీక్ష
- Physical Endurance Test (Swimming Test) (Seaman & Greaser పోస్టులకు)
- Document Verification
- Medical Fitness Test
అప్లికేషన్ ఫీజు
- అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
Also Read : AAI Apprentice Recruitment 2025| ఎయిర్‌పోర్ట్‌లో అప్రెంటిస్ నోటిఫికేషన్
జీతం వివరాలు (Salary Details)
ఈ పోస్టులకు 7th CPC ప్రకారం కింది పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది:
| పోస్టు పేరు | పే లెవల్ | నెలకు జీతం శ్రేణి (₹) |
|---|---|---|
| Tradesman | Level – 2 | ₹19,900 – ₹63,200 |
| Seaman | Level – 1 | ₹18,000 – ₹56,900 |
| Greaser | Level – 1 | ₹18,000 – ₹56,900 |
| Senior Store Keeper | Level – 5 | ₹29,200 – ₹92,300 |
దరఖాస్తు విధానం
అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తులు సమర్పించాలి.
అవసరమైన పత్రాలు:
- విద్యార్హత సర్టిఫికేట్లు
- అనుభవ సర్టిఫికేట్లు (డ్యూటీ వివరాలు తప్పనిసరి)
- వయస్సు నిర్ధరణ
- కేటగిరీ సర్టిఫికేట్ (అవసరమైతే)
- 4 పాస్‌పోర్ట్ ఫోటోలు
- Two self-addressed envelopes
దరఖాస్తు పంపాల్సిన చిరునామా:
The Additional Commissioner of Customs (Establishment), Office of the Commissioner of Customs (Preventive), 5th Floor, Catholic Centre, Broadway, Cochin – 682031
- కవరుపై APPLICATION FOR MARINE WING POST – POST NAME – CATEGORY రాయలి.
- కేవలం Ordinary Post ద్వారా మాత్రమే
- Courier / Speed Post / Hand Submission అనుమతి లేదు
దరఖాస్తులకు చివరి తేదీ
- 15 డిసెంబర్ 2025 లోపు దరఖాస్తు చేరాలి.
| Notification & Application | Click here |
| Official website | Click here |






