SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్

On: November 13, 2025
SAIL Management Trainee Recruitment 2025

SAIL Management Trainee Recruitment 2025 : ఇంజినీరింగ్ పూర్తయ్యాక మంచి సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. తాజాగా SAIL (Steel Authority of India Limited), మహారత్న స్థాయి ప్రభుత్వ సంస్థ, దేశ వ్యాప్తంగా ఉన్న తన ప్లాంట్లు మరియు మైన్స్‌లో పనిచేయడానికి Management Trainee (Technical) పోస్టులను ప్రకటించింది. మొత్తం 124 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సాధారణంగా SAIL నోటిఫికేషన్ వస్తే పోటీ ఎక్కువే… కానీ ఈసారి డిసిప్లైన్స్ స్పష్టంగా ఇవ్వడంతో, తగిన అర్హతలతో ఉన్న అభ్యర్థులకు మంచి ఛాన్స్ ఉంటుంది. Chemical నుంచి Metallurgy వరకు మొత్తం 7 ఇంజినీరింగ్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ట్రైనింగ్ తర్వాత నేరుగా Assistant Manager – E1 Grade గా పోస్టింగ్ ఇస్తారు. అలాగే జీతం దాదాపు 16–17 లక్షల CTC ఉంటుంది. అప్లికేషన్ ప్రక్రియ నవంబర్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. అభ్యర్థులు డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  05 డిసెంబర్ 2025 చివరి తేది. ఎవరికైనా ఒక మంచి స్థాయి PSU లో కెరీర్ ప్రారంభించాలనిపిస్తే, ఈ నోటిఫికేషన్ తప్పక పరిశీలించాల్సిందే.

SAIL Management Trainee Recruitment 2025
SAIL Management Trainee Recruitment 2025

ఖాళీల వివరాలు 

మొత్తం ఖాళీలు: 124

  1. Chemical – 5 పోస్టులు
    కెమికల్ ప్రాసెస్ కంట్రోల్, సేఫ్టీ, యుటిలిటీస్ హ్యాండ్లింగ్ వంటి పనులు.
  2. Civil – 14 పోస్టులు
    ప్లాంట్ నిర్మాణం, మైనింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డిజైన్ పనుల్లో ముఖ్య బాధ్యతలు.
  3. Computer – 4 పోస్టులు
    సిస్టమ్స్, నెట్‌వర్క్స్, సాఫ్ట్‌వేర్ సమర్థంగా పనిచేయడానికి IT సపోర్ట్ పాత్ర.
  4. Electrical – 44 పోస్టులు
    పవర్ సిస్టమ్స్, హెవీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్, సబ్‌స్టేషన్ వర్క్స్.
  5. Instrumentation – 7 పోస్టులు
    ఆటోమేషన్, ఇండస్ట్రియల్ కంట్రోల్ సిస్టమ్స్, సెన్సార్-బేస్డ్ ప్రాసెస్ మానిటరింగ్.
  6. Mechanical – 30 పోస్టులు
    ప్రొడక్షన్ లైన్స్, మెషిన్ మెయింటెనెన్స్, పరికరాల పనితీరు మెరుగుదల.
  7. Metallurgy – 20 పోస్టులు
    స్టీల్ ప్రాసెసింగ్, హీట్ ట్రీట్మెంట్, మెటల్ టెస్టింగ్ & క్వాలిటీ కంట్రోల్.

Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్

అర్హతలు (Eligibility)

SAIL Management Trainee Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Chemical, Civil, Computer, Electrical, Instrumentation, Mechanical, Metallurgy
65% మార్కులతో B.E/B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. 

 వయోపరిమితి(Age Limit)

SAIL Management Trainee Recruitment 2025  అభ్యర్థులకు 05.12.2025 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

జీతం (Salary Structure)

SAIL Management Trainee Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులక ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • ట్రైనింగ్ సమయంలో నెలకు: ₹50,000/-
  • Training పూర్తయ్యాక: Assistant Manager (E1 Grade) – ₹60,000 నుండి ₹1,80,000

అప్లికేషన్ ఫీజు

SAIL Management Trainee Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • General / OBC / EWS : ₹1,050/-
  • SC / ST / PwBD / ESM / Departmental : ₹300/-

Also Read : CAU Recruitment 2025 | 174 ఫ్యాకల్టీ పోస్టులు – జీతం ₹2 లక్షల వరకు – ఇప్పుడే దరఖాస్తు చేయండి!

 ఎంపిక ప్రక్రియ

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది.

  1. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్(CBT) 
  2. గ్రూప్ డిస్కషన్ (GD) 
  3. ఇంటర్వ్యూ
  4. Final Merit Weightage → 75% CBT + 10% GD + 15% Interview

Apply చేయడం ఎలా?

  1. www.sail.co.in → Careers పేజీకి వెళ్లాలి.
  2. కొత్త రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  3. అప్లికేషన్ ఫారం నింపాలి.
  4. ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
  5. ఫీజు చెల్లించిన తర్వాత అప్లికేషన్ నంబర్ వస్తుంది.
  6. అప్లికేషన్ కాపీ ప్రింట్ తీసుకోవాలి

 ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 15 నవంబర్ 2025
  • చివరి తేదీ: 05 డిసెంబర్ 2025
  • CBT ఎగ్జామ్: జనవరి లేదా ఫిబ్రవరి 2026
NotificationClick here
Apply  OnlineClick here

Also Read : BEL Project Engineer Recruitment 2025 | భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో కొత్త నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News