IB ACIO Tech Notification 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 టెక్నికల్ పోస్టులు

On: October 26, 2025
IB ACIO Tech Notification 2025

IB ACIO Tech Notification 2025 : భారత ప్రభుత్వ హోమ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.  ఈ రిక్రూట్మెంట్ ద్వారా Assistant Central Intelligence Officer Grade-II/Tech (ACIO-II/Tech) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 258 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టెక్నాలజీ రంగంలో నైపుణ్యం ఉన్న యువ ఇంజనీర్లకు ఇది అద్భుత అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 16వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

ib-acio-notification
ib-acio-notification

ఖాళీల వివరాలు : 

విభాగంపోస్టుల సంఖ్య
కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ90
ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్168
మొత్తం పోస్టులు258

Also Read : ISRO SAC Recruitment 2025 | ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్

అర్హతలు : 

IB ACIO Tech Notification 2025 అభ్యర్థులు GATE 2023 / 2024 / 2025 లో Electronics & Communication (EC) లేదా Computer Science (CS) పేపర్‌లో qualifying cut-off marks సాధించి ఉండాలి. దీనితో పాటు క్రిందివాటిలో ఏదో ఒక అర్హత ఉండాలి.

  •  Electronics / Communication / IT / Computer Science B.E / B.Tech (లేదా) Electronics / Computer Science / Physics with Electronics M.Sc / MCA

వయోపరిమితి : 

IB ACIO Tech Notification 2025 అభ్యర్థులు 16.11.2025 నాటికి 18 నుంచి  27 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

IB ACIO Tech Notification 2025 అప్లికేషన్ ఫీజు SBI ePay Lite ద్వారా Online / UPI / Net Banking / Debit/Credit Card / Challan ద్వారా చేల్లించాలి.

ఎంపిక ప్రక్రియ : 

IB ACIO Tech Notification 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • GATE స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్
  • స్కిల్ టెస్ట్ – టెక్నికల్ ప్రాక్టికల్ పరీక్ష
  • ఇంటర్వ్యూ – సబ్జెక్ట్ నాలెడ్జ్ & కమ్యూనికేషన్ స్కిల్స్

మొత్తం మార్కులు:

  • GATE – 750 మార్కులు
  • స్కిల్ టెస్ట్ – 250 మార్కులు
  • ఇంటర్వ్యూ – 175 మార్కులు

Also Read : BEL Probationary Engineer Recruitment 2025 | BEL భారీ నోటిఫికేషన్ – 340 ఇంజనీర్ పోస్టులు

జీతం వివరాలు : 

IB ACIO Tech Notification 2025 ఎంపికైన అభ్యర్థులకు లెవల్-7 ప్రకారం ₹44,900 – ₹1,42,400/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదనంగా Special Security Allowance @ 20% మరియు హాలిడే డ్యూటీకి అదనపు క్యాష్ అలవెన్స్ ఉంటాయి. 

దరఖాస్తు విధానం : 

IB ACIO Tech Notification 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్లు www.mha.gov.in లేదా www.ncs.gov.in సందర్శించాలి. 
  • “ACIO-II/Tech Recruitment 2025” లింక్‌ ద్వారా Online Apply చేయాలి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • ఫోటో, సిగ్నేచర్, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 16 నవంబర్, 2025
NotificationClick here
Apply Online Click here

Also Read : NIA Recruitment 2025 Apply Online | ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ లో బంపర్ జాబ్స్

Leave a Comment

Follow Google News