వైఎస్సార్ నవశకం ద్వారా కొత్త రైస్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం సర్వే చేయడం జరిగింది. ఫిబ్రవరి 15 నుంచి రాష్ట్రంలో కొత్త రైస్ కార్డులు అందజేస్తారు. ఆ కొత్త రైస్ కార్డు రావాలంటే మాపింగ్ లిస్ట్ లో మన పేరు, రేషన్ కార్డు నంబరు ఉండాలి. అవి ఉంటేనే మనకు రైస్ కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది.
ఎన్ని కార్డులు మ్యాపింగ్ అయ్యాయి? ఎన్ని కాలేదు? అసలు మన పేరు మ్యాపింగ్ లిస్ట్ లో ఉందా లేదా మన వలంటీర్ మ్యాపింగ్ చేశారా లేదా ? అని ఏ విధంగా తెలుసుకోవాలో మనం తెలుసుకుందాం…ఒక వేళ దీనిలో పేరు లేకపోతే మీ సచివాలయంలో లేదా మీ వలంటీర్ వద్ద కొత్త రేషన్ కార్డుకు అప్లయి చేసుకోవాల్సి ఉంటుంది..వారు పరిశీలించి కొత్త రేషన్ కార్డుకు అప్లయి చేస్తారు. మన రైస్ కార్డు మ్యాప్ అయిందా? లేదా ? తెలుసుకోవడం కోసం కింద చెప్పబోయే ప్రోసెస్ ని ఫాలో అవండి..
రైస్ కార్డు యొక్క మీ లావాదేవీ చరిత్రను తనిఖీ చేయడానికి, మీరు క్రింద ఇవ్వబడిన సాధారణ విధానాన్ని అనుసరించాలి: –
1.“అప్లికేషన్ సెర్చ్” ఎంపిక కోసం శోధించండి.
2.బాక్స్‌లో రేషన్ కార్డ్ లేదా అప్లికేషన్ నంబర్‌ను నమోదు చేయండి.
3.సమర్పించు బటన్ పై క్లిక్ చేయండి.
4.అప్లికేషన్ స్థితి తెరపై కనిపిస్తుంది.
కొత్త బియ్యం కార్డు వచ్చినవారు ( Eligible)
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/RiceCardStatus
పాత రేషన్ కార్డు ఉన్నవారు ( Ineligible)
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/RationCardStatus