NIT Durgapur Non-Teaching Jobs 2025 | 118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

On: November 13, 2025
NIT Durgapur Non-Teaching Recruitment 2025

NIT Durgapur Non-Teaching Jobs 2025 : దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ విద్యాసంస్థలలో ఒకటైన NIT దుర్గాపూర్ వివిధ నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి భారీగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టులు కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా మంచి జీతంతో పనిచేసే అవకాశాన్ని పొందవచ్చు. గ్రూప్ A, B, C కింద ఉన్న ఈ పోస్టులకు వేర్వేరు అర్హతలు మరియు జీత స్థాయిలు ఉన్నాయి.

NIT Durgapur Non-Teaching Recruitment 2025
NIT Durgapur Non-Teaching Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 118 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

గ్రూప్ – A పోస్టులు

  • Principal Scientific/ Technical Officer – 02
  • Superintending Engineer – 01
  • Deputy Librarian – 01
  • Senior SAS Officer – 01
  • Medical Officer – 01
  • Assistant Registrar – 02
  • Assistant Librarian – 01
  • Scientific/ Technical Officer – 01

గ్రూప్ – B పోస్టులు

  • Technical Assistant/ Junior Engineer – 25
  • Library & Information Assistant – 01
  • Superintendent – 05

గ్రూప్ – C పోస్టులు

  • Senior Technician – 13
  • Senior Assistant – 07
  • Technician – 26
  • Junior Assistant – 14
  • Lab/ Office Attendant – 17

Also Read : MIDHANI Apprentice Recruitment 2025 | హైదరాబాద్ మిధానిలో అప్రెంటిస్ నోటిఫికేషన్

అర్హతలు

NIT Durgapur Non-Teaching Jobs 2025 ప్రతి పోస్టుకు వేర్వేరు అర్హతలు ఉంటాయి. 

  • Group A పోస్టులకు — B.Tech/ M.Sc/ MCA/ Master’s Degree/ MBBS
  • Group B పోస్టులకు — B.Tech, Diploma, Bachelor Degree.
  • Group C పోస్టులకు — 10+2, ITI, Diploma, Bachelor’s Degree (పోస్టు ఆధారంగా మారుతుంది).

వయోపరిమితి

ప్రతి పోస్టుకు వేర్వేరు గరిష్ట వయస్సు నిర్ధారించారు.

  • Group A పోస్టులు – 35 నుంచి 56 ఏళ్లు
  • Group B పోస్టులు – 30 ఏళ్లు
  • Group C పోస్టులు – 27 నుంచి 33 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు

అప్లికేషన్ ఫీజు పోస్టుల గ్రూప్ ఆధారంగా ఉంటుంది.

  • Group A: ₹1500
  • Group B & C: ₹1000
  • SC/ST/PwD/Ex-Servicemen మరియు మహిళలకు ఫీజు లేదు

ఎంపిక ప్రక్రియ

పోస్టు ఆధారంగా ఎంపిక విధానం వేర్వేరుగా ఉంటుంది.

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ (అవసరమైతే)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • ఇంటర్వ్యూ (Group A పోస్టులకు ఎక్కువగా ఇంటర్వ్యూ ఆధారితంగా)

Also Read : SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్

జీతం వివరాలు

జీతం 7వ వేతన కమిషన్ ప్రకారం లెవల్ ఆధారంగా ఉంటుంది.

  • Group A: Pay Level 10 – 14 : రూ.56,100 – రూ.2,18,200/-
  • Group B: Pay Level 6 : రూ.35,400 – రూ.1,12,400/-
  • Group C: Pay Level 1 – 4 : రూ.18,000 – రూ.81,100/-

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

  1. అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లాలి – nitdgp.ac.in → Careers → Non-Teaching Recruitment
  2. మీ పోస్టు కోసం సరైన అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేయండి
  3. వివరాలు సరిగ్గా నమోదు చేయండి
  4. అవసరమైన డాక్యుమెంట్లు (ఒకే PDF లో 10MB లోపు) అప్‌లోడ్ చేయండి
  5. ఫీజు చెల్లించి ఫైనల్ సబ్మిట్ చేయండి
  6. అప్లికేషన్ కాపీ సేవ్ చేసుకోవాలి

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ : 12 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : నోటిఫికేషన్ వెలువడిన 21 రోజుల వరకు
NotificationClick here
Apply OnlineClick here

Also Read : MSTC Management Trainee Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో భారీ జీతంతో ఉద్యోగాలు

Leave a Comment

Follow Google News