NFC Hyderabad Apprentice Recruitment 2025 | NFC హైదరాబాద్ లో 405 ఖాళీలు

On: November 2, 2025
NFC Hyderabad Apprentice Recruitment 2025

NFC Hyderabad Apprentice Recruitment 2025 : భారత ప్రభుత్వం ఆధీనంలోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ (Nuclear Fuel Complex – NFC), హైదరాబాద్ సంస్థలో 2025-26 సంవత్సరానికి ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 405 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు ఆన్ లైేన్ లో దరఖాస్తు చేసుకోగలరు. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత గల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ ఒక సంవత్సరం కాలానికి ఉంటుంది. ఎంపిక పూర్తిగా మెరిట్‌ ఆధారంగా జరుగుతుంది.

NFC Hyderabad Apprentice Recruitment 2025
NFC Hyderabad Apprentice Recruitment 2025

ఖాళీల వివరాలు : 

మొత్తం ఖాళీల సంఖ్య : 405

  • ఫిట్టర్ : 126
  • టర్నర్ : 35
  • ఎలక్ట్రీషియన్ : 53
  • మెషినిస్ట్ : 17
  • కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ : 23
  • ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ : 19
  • ఎలక్ట్రానిక్స్ మెకానిక్ : 24
  • లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) : 1
  • మోటార్ మెకానిక్(వెహికల్) : 4
  • డ్రాఫ్ట్స్ మెన్(మెకానికల్) : 3
  • కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ : 59
  • డీజిల్ మెకానిక్ : 4
  • కార్పెంటర్ : 5
  • ప్లంబర్  5
  • వెల్డర్ : 26
  • స్టెనోగ్రాఫర్ : 1

Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

అర్హతలు : 

NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులు 10వ తరగతి (SSC) పాస్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత ITI ట్రేడ్‌లో పాస్ (NCVT/SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయోపరిమితి : 

NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. 

ఎంపిక ప్రక్రియ : 

NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. 

  • Electrician ట్రేడ్‌ కోసం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
  • మిగతా ట్రేడ్లకు అభ్యర్థుల ITI మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు. మార్కులు సమానంగా ఉంటే 10వ తరగతి మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు. 

Also Read : BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్

స్టైఫండ్ : 

NFC Hyderabad Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600/- నుంచి రూ.10,560/- వరకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన వారికి Nuclear Fuel Complex (NFC), హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేయాలి. 

  • అభ్యర్థులు ముందుగా NAPS పోర్టల్ (www.apprenticeshipindia.gov.in) లో రిజిస్టర్ కావాలి.
  • ఆ తర్వాత Nuclear Fuel Complex, Hyderabad (Establishment Code: E11153600013) ఎంపిక చేసి అప్లై చేయాలి.
  • అవసరమైన సర్టిఫికేట్లు — 10వ క్లాస్, ITI, కుల/వికలాంగత సర్టిఫికేట్లు (అవసరమైతే) — పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తులకు చివరి తేదీ : 15 నవంబర్, 2025

NotificationClick here
Official WebsiteClick here

Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News