RRC SCR Sports Quota Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

On: November 2, 2025
RRC SCR Sports Quota Recruitment 2025

RRC SCR Sports Quota Recruitment 2025 :  భారత రైల్వేలో ఉద్యోగం చేయాలని కలగంటున్న క్రీడా ప్రతిభావంతులైన యువతకు ఇప్పుడు అద్భుతమైన అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) స్పోర్ట్స్ కోటా కింద 2025-26 సంవత్సరానికి కొత్త నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాల ద్వారా రైల్వే శాఖలోని వివిధ క్రీడా విభాగాల్లో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, క్రికెట్, వాలీబాల్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, కబడ్డీ వంటి క్రీడల్లో ప్రతిభ చూపిన యువకులు ఉద్యోగావకాశం పొందవచ్చు. మొత్తం 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 25వ తేదీ నుంచి నవంబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

RRC SCR Sports Quota Recruitment 2025
RRC SCR Sports Quota Recruitment 2025

ఖాళీల వివరాలు : 

ఈ పోస్టులు అథ్లెటిక్స్, క్రికెట్, బాక్సింగ్, వాలీబాల్, వెయిట్‌లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, హాకీ, కబడ్డీ, ఖో-ఖో వంటి క్రీడా విభాగాల్లో ఉన్నాయి. మొత్తం 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

గ్రూప్ ‘C’ పోస్టులు: 21 (లెవెల్ 3/2)

  • SCR
  • హెడ్ క్వార్టర్స్
  • సికింద్రాబాద్

గ్రూప్ ‘D’ పోస్టులు: 40 (లెవల్-1)

  • హెడ్ క్వార్టర్స్ : 10 
  • సికింద్రాబాద్ డివిజన్ : 5
  • హైదరాబాద్ డివిజన్ : 5
  • విజయవాడ డివిజన్ : 5
  • గుంటూరు డివిజన్ : 5
  • గుంతకల్ డివిజన్ : 5
  • నాందేడ్ డివిజన్ : 5

Also Read : CCI Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్

అర్హతలు : 

RRC SCR Sports Quota Recruitment 2025 పోస్టు లెవల్ ని బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

  • గ్రూప్ ‘C’ పోస్టులకు: 12వ తరగతి (ఇంటర్మీడియట్) లేదా సమానమైన విద్యార్హత.
  • గ్రూప్ ‘D’ పోస్టులకు: 10వ తరగతి లేదా ITI లేదా National Apprenticeship Certificate (NAC).
  • క్రీడా అర్హతలు: అభ్యర్థులు జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడా ఈవెంట్లలో పాల్గొనివుండాలి లేదా మెడల్ సాధించి ఉండాలి.

వయోపరిమితి : 

RRC SCR Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. వయోపరిమితిలో ఎటువంటి సడలింపు ఉండదు. 

అప్లికేషన్ ఫీజు : 

RRC SCR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ అభ్యర్థులు : రూ.500/-
  • SC/ST/మహిళలు/ మైనారిటీలు/ఆర్థికంగా వెనుకబడినవారు : రూ.250/-

ఎంపిక ప్రక్రియ : 

 RRC SCR Sports Quota Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది. 

  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • స్పోర్ట్స్ ట్రయల్స్ (పరీక్ష)
  • అర్హతలు & స్పోర్ట్స్ అచీవ్‌మెంట్‌ 

Also Read : NFC Hyderabad Apprentice Recruitment 2025 | NFC హైదరాబాద్ లో 405 ఖాళీలు

జీతం వివరాలు : 

RRC SCR Sports Quota Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ ని బట్టి జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • లెవల్-3 పోస్టులకు : ₹21,700 – ₹69,100/-
  • లెవల్-2 పోస్టులకు : ₹19,900 – ₹63,200/-
  • లెవల్-1 పోస్టులకు : ₹18,000 – ₹56,900/-

దరఖాస్తు విధానం : 

RRC SCR Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 25 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 24 నవంబర్, 2025
NotificationClick Here
Apply OnlineClick here

Also Read : RITES Recruitment 2025 | RITES లిమిటెడ్ లో భారీ నోటిఫికేషన్ – 600 పోస్టులు భర్తీ

Leave a Comment

Follow Google News