APEDA Recruitment 2025 : భారత ప్రభుత్వం వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వశాఖకు చెందిన APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) లో కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయం, ఫుడ్ టెక్నాలజీ మరియు ఐటీ రంగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య : 6
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (Information Technology) – 1
- అసిస్టెంట్ మేనేజర్ (Agriculture) – 1
- అసిస్టెంట్ మేనేజర్ – 4 పోస్టులు
Also Read : CSIR–NIO Recruitment 2025 | NIOలో బంపర్ నోటిఫికేషన్
అర్హతలు:
APEDA Recruitment 2025 అభ్యర్థులకు పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(IT) : కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. + కనీసం 5 సంవత్సరాల అనుభవం
- అసిస్టెంట్ మేనేజర్(అగ్రికల్చర్) : అగ్రికల్చర్ / హార్టికల్చర్ / వెటర్నరీ / ఫుడ్ టెక్నాలజీ / డైరీ సైన్స్ / ఫుడ్ ప్రాసెసింగ్ లో బాచిలర్ డిగ్రీ.
- అసిస్టెంట్ మేనేజర్ : అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, డైరీ సైన్స్ లేదా ఫుడ్ సైన్స్ సంబంధిత బాచిలర్ డిగ్రీ.
వయో పరిమితి:
APEDA Recruitment 2025 అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు 35 సంవత్సరాలు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
APEDA Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (IT): ₹56,100 – ₹1,77,500/-
- అసిస్టెంట్ మేనేజర్: ₹35,400 – ₹1,12,400/-
Also Read : CCI Young Professionals Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు:
APEDA Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General / OBC / EWS:
- AGM (IT): ₹500/-
- AM (Agriculture/Other): ₹300/-
- Women / SC / ST / PwBD: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
APEDA Recruitment 2025 పోస్టును ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఐటీ) :
- రాత పరీక్ష (100 మార్కులు)
- ఇంటర్వ్యూ (40 మార్కులు)
అసిస్టెంట్ మేనేజర్ :
- రాత పరీక్ష
పరీక్షా కేంద్రం: Delhi NCR
దరఖాస్తు విధానం:
APEDA Recruitment 2025 అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి. అధికారిక వెబ్‌సైట్‌లో (APEDA Portal) లింక్ అందుబాటులో ఉంటుంది. అవసరమైన సర్టిఫికేట్లు మరియు ఫోటో అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 1 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 01 డిసెంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : NFC Hyderabad Apprentice Recruitment 2025 | NFC హైదరాబాద్ లో 405 ఖాళీలు






