CSL Operator Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన మినిరత్నా కేటగిరీ-‘A’ పబ్లిక్ సెక్టార్ కంపెనీ అయిన Cochin Shipyard Limited (CSL) నుండి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడులైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ పద్ధతిలో ఆపరేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 21వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 27
- ఆపరేటర్ (Forklift / Aerial Work Platform) : 24
- ఆపరేటర్ (Diesel Cranes) : 3
Also Read : AVNL MPF Ambarnath Recruitment 2025 | రక్షణ మంత్రిత్వ శాఖలో జాబ్స్
అర్హతలు :
CSL Operator Recruitment 2025 అభ్యర్థులు 7వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత వాహనాల హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఫోర్క్‌లిఫ్ట్ / క్రేన్ ఆపరేషన్‌లో కనీసం 1 సంవత్సరం అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
CSL Operator Recruitment 2025 అభ్యర్థులకు 21 నవంబర్ 2025 నాటికి 45 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
CSL Operator Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ : రూ.200/-
- ఎస్సీ / ఎస్టీ : ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
CSL Operator Recruitment 2025 అభ్యర్థులను కేవలం ప్రాక్టికల్ టెస్ట్ (100 మార్కులు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read : NABARD Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ పోస్టులు
జీతం వివరాలు:
CSL Operator Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరం నెలకు ₹27,000/- కన్‌సాలిడేటెడ్ పే ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇన్క్రిమెంట్ ఉంటుంది.
దరఖాస్తు విధానం :
CSL Operator Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేైసుకోవాలి. ముందుగా ముందుగా www.cochinshipyard.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. Career → CSL, Kochi సెక్షన్‌లో యూజర్ మాన్యువల్ చదవాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి. లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఫీజు చెల్లించి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత “In Process” స్టేటస్ కనిపిస్తే దరఖాస్తు విజయవంతంగా సమర్పించినట్లే.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్ లైన అప్లికేషన్ ప్రారంభం : 05 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 21 నవంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు






