AP TET 2025 Notification Out : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ ఆధ్వర్యంలో APTET (Andhra Pradesh Teacher Eligibility Test) అక్టోబర్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ప్రాథమిక (Class 1–V) మరియు అపర్ ప్రైమరీ (Class 6–8) తరగతులకి టీచర్‌గా అర్హత పొందవచ్చు. పరీక్ష పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ మోడ్ (CBT) లో నిర్వహించబడుతుంది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం రెగ్యులర్ అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా పరీక్ష రాసేందుకు అవకాశం కల్పించింది.

ముఖ్యమైన తేదీలు
- నోటిఫికేషన్ విడుదల తేదీ: 24 అక్టోబర్ 2025
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 అక్టోబర్ 2025
- చివరి తేదీ: 23 నవంబర్ 2025
- మాక్ టెస్టులు : 25 నవంబర్, 2025
- హాల్ టికెట్ డౌన్లోడ్: 3, డిసెంబర్ 2025 నుండి
- పరీక్ష మోడ్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)
Also Read : BEL Probationary Engineer Recruitment 2025 | BEL భారీ నోటిఫికేషన్ – 340 ఇంజనీర్ పోస్టులు
అర్హతలు (AP TET 2025 Notification Out Eligibility Criteria) :
Paper 1A – Classes I to V (Regular Schools)
- Intermediate (or equivalent)లో కనీసం 50% మార్కులు.
- SC/ST/BC/PwBD అభ్యర్థులకు 45% మార్కులు సరిపోతాయి.
- రెండు సంవత్సరాల Diploma in Elementary Education (D.El.Ed) లేదా B.El.Ed పూర్తిచేసి ఉండాలి.
Paper 1B – Classes I to V (Special Schools)
- Intermediateలో కనీసం 50% మార్కులు.
- మరియు D.Ed (Special Education) లేదా సంబంధిత RCI Approved Course పూర్తి చేసి ఉండాలి.
Paper 2A – Classes VI to VIII (Regular Schools)
- Graduationలో కనీసం 50% మార్కులు (SC/ST/BC/PwBD అభ్యర్థులకు 45%).
- అలాగే B.Ed లేదా B.El.Ed పూర్తి చేసి ఉండాలి.
Paper 2B – Classes VI to VIII (Special Schools)
- Graduation లేదా Post-Graduationలో కనీసం 50% మార్కులు.
- మరియు B.Ed (Special Education) లేదా B.Ed + Special Diploma ఉండాలి.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
- ప్రతి పేపర్‌కు ₹1000/- చెల్లించాలి.
- ఒకటి కంటే ఎక్కువ పేపర్లకు దరఖాస్తు చేస్తే, ప్రతి పేపర్‌కి వేర్వేరుగా ఫీజు చెల్లించాలి.
- చెల్లింపు Payment Gateway ద్వారా మాత్రమే జరగాలి.
దరఖాస్తు విధానం (AP TET 2025 Notification How to Apply)
- అధికారిక వెబ్సైట్ https://cse.ap.gov.in ఓపెన్ చేయండి.
- “APTET October 2025” నోటిఫికేషన్ చదివి మీ అర్హతను నిర్ధారించుకోండి.
- “Apply Online” పై క్లిక్ చేయండి.
- మొదటగా జర్నల్ నంబర్ పొందడానికి రిజిస్ట్రేషన్ చేయండి.
- ఫోటో, సంతకం అప్లోడ్ చేసి వివరాలు సరిచూసుకోండి.
- ఫీజు చెల్లించి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
- సబ్మిట్ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోవడం తప్పనిసరి.
Exam Pattern :
Paper 1A – Regular Schools
| విభాగం | ప్రశ్నలు | మార్కులు |
| Child Development & Pedagogy | 30 | 30 |
| Language I (Telugu/Urdu/Hindi etc.) | 30 | 30 |
| Language II (English) | 30 | 30 |
| Mathematics | 30 | 30 |
| Environmental Studies | 30 | 30 |
| మొత్తం | 150 | 150 |
Paper 2A – Regular Schools
| విభాగం | ప్రశ్నలు | మార్కులు |
| Child Development & Pedagogy | 30 | 30 |
| Language I | 30 | 30 |
| Language II (English) | 30 | 30 |
| Mathematics/Science/Social Studies | 60 | 60 |
| మొత్తం | 150 | 150 |
పాస్ మార్కులు (Qualifying Marks)
| వర్గం | శాతం | కనీస మార్కులు |
| OC/EWS | 60% | 90 మార్కులు |
| BC | 50% | 75 మార్కులు |
| SC/ST/PwBD/Ex-Servicemen | 40% | 60 మార్కులు |
సర్టిఫికేట్ చెల్లుబాటు (Certificate Validity)
APTET ఉత్తీర్ణత సర్టిఫికేట్ లైఫ్ టైం వరకు చెల్లుతుంది. అభ్యర్థులు ఇష్టముంటే తమ స్కోరు మెరుగుపరచడానికి మళ్లీ పరీక్ష రాయవచ్చు.
టెట్ షెడ్యూల్ ఇదీ :
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | 24 అక్టోబర్, 2025 |
| ఆన్ లైన్ దరఖాస్తు ప్ర | 24 అక్టోబర్, 2025 |
| ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ | 23 నవంబర్, 2025 |
| ఆన్ లైన్ మాక్ టెస్ట్ | 25 నవంబర్, 2025 |
| అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ | 3 డిసెంబర్, 2025 నుంచి |
| ఏపీ టెట్ పరీక్ష | 10 డిసెంబర్, 2025 సెషన్ 1 టైమింగ్ : ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:00 వరకుసెషన్ 2 టైమింగ్ : మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:00 వరకు |
| కీ విడుదల | 2 జనవరి, 2026 |
| కీపై అభ్యంతరాల స్వీకరణ | 2 జవవరి నుంచి 9, 2026 వరకు |
| తుది కీ విడుదల | 13 జనవరి, 2026 |
| ఫలితాలు ప్రకటన | 19 జనవరి, 2026 |
Notification : Click here
Apply Online : Click here
Also Read : NIA Recruitment 2025 Apply Online | ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ లో బంపర్ జాబ్స్






