APMSRB AYUSH Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(APMSRB) ఆధ్వర్యంలో ఆయూష్ డిపార్ట్మెంట్, విజయవాడ పరిధిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ / అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 107 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 107
- స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ (State Program Manager)
- ఫైనాన్స్ మేనేజర్ (Finance Manager)
- డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ (District Program Manager)
- సైకియాట్రిస్ట్ (Psychiatrist)
- AYUSH డాక్టర్ (Ayurveda)
- AYUSH డాక్టర్ (Homoeopathy)
- AYUSH డాక్టర్ (Unani)
- యోగా ఇన్‌స్ట్రక్టర్స్ (Yoga Instructors)
Also Read : TMC Non-Medical Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో బంపర్ జబ్స్ – 330 పోస్టులు
అర్హతలు :
APMSRB AYUSH Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టును బట్టి కింది అర్హతలు ఉండాలి.
| పోస్టు పేరు | విద్యార్హత |
| స్టేట్ ప్రోగ్రాం మేనేజర్ | AYUSH డిగ్రీతో పాటు MBA (Healthcare / HR / Hospital Administration) లేదా PG Diploma in Hospital & Health Care Management ఉండాలి. కనీసం 5 ఏళ్ల అనుభవం అవసరం. |
| ఫైనాన్స్ మేనేజర్ | MBA (Finance) / M.Com / CA / ICWA డిగ్రీ ఉండాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం అవసరం. |
| డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ | AYUSH డిగ్రీ + MBA (Healthcare / Hospital Administration) లేదా PG Diploma in Health Care Management ఉండాలి. కనీసం 3 ఏళ్ల అనుభవం. |
| సైకియాట్రిస్ట్ | MD (Psychiatry) డిగ్రీ అవసరం. |
| ఆయూష్ డాక్టర్ (Ayurveda) | BAMS డిగ్రీతో పాటు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయి ఉండాలి. |
| ఆయూష్ డాక్టర్ (Homoeopathy) | BHMS డిగ్రీతో పాటు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయి ఉండాలి. |
| ఆయూష్ డాక్టర్ (Unani) | BUMS డిగ్రీతో పాటు రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ అయి ఉండాలి. |
| యోగా ఇన్ స్ట్రక్టర్ | BNYS లేదా BAMS డిగ్రీతో పాటు Diploma / M.Sc in Yoga ఉండాలి. |
వయోపరిమితి :
APMSRB AYUSH Recruitment 2025 స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్, ఫైనాన్స్ మేనేజర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టులకు 21 నుంచి 60 సంవత్సరాలు, ఆయూష్ డాక్టర్స్, యోగా ఇన్ స్ట్రక్టర్, సైకియాట్రిస్ట్ పోస్టులకు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/BC/EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
APMSRB AYUSH Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- జనరల్ అభ్యర్థులు : రూ.1,000/-
- SC/ST/BC/EWS/PH/Ex-Servicemen : రూ.750/-
ఎంపిక ప్రక్రియ :
APMSRB AYUSH Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక 100 పాయింట్ల ఆధారంగా జరుగుతుంది. ఎటువంటి ఇంటర్వ్యూ ఉండదు. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
- 75 పాయింట్లు: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా
- 15 పాయింట్లు: కాంట్రాక్ట్ సేవలు లేదా COVID విధుల్లో అనుభవం ఆధారంగా
- 10 పాయింట్లు: సర్వీస్ అనుభవం (ప్రతి సంవత్సరం)
Also Read : RITES Recruitment 2025 | RITES లిమిటెడ్ లో భారీ నోటిఫికేషన్ – 600 పోస్టులు భర్తీ
జీతం వివరాలు :
| పోస్టు పేరు | జీతం (ప్రతి నెలకు) |
| స్టేట్ ప్రోగ్రామ్ మేనేజర్ | ₹75,000/- |
| ఫైనాన్స్ మేనేజర్ | ₹50,000/- |
| డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ | ₹50,000/- |
| సైకియాట్రిస్ట్ | ₹15,000/- |
| ఆయూష్ డాక్టర్స్ (Ayurveda / Homoeopathy / Unani) | ₹40,000/- |
| యోగా ఇన్ స్ట్రక్టర్ | ₹27,500/- |
దరఖాస్తు విధానం :
APMSRB AYUSH Recruitment 2025 అభ్యర్థలు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ https://apmsrb.ap.gov.in/msrb లోకి వెళ్ళండి.
- “Apply Online” పై క్లిక్ చేసి, సరైన పోస్టు ఎంచుకోండి.
- అవసరమైన వివరాలు భర్తీ చేసి, అన్ని సర్టిఫికేట్లు PDF రూపంలో అప్‌లోడ్ చేయండి.
- అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి
- అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత Application Number పొందండి – భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని సేవ్ చేసుకోండి.
దరఖాస్తులకు చివరి తేదీ: 15 నవంబర్ 2025 (రాత్రి 11:59 వరకు)
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RGNAU Professional Trainee Recruitment 2025 | నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీలో ప్రొఫెషనల్ ట్రైనీ జాబ్స్






