BEL Probationary Engineer Recruitment 2025 : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL), రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే భారత ప్రభుత్వ “నవరత్న PSU” సంస్థ. ఈ సంస్థ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో E-II గ్రేడ్ లో ప్రొబేషనరీ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 340 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) లో పనిచేయాలనుకునే ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్‌కి ఇది ఒక అద్భుత అవకాశం. స్థిరమైన ఉద్యోగం, మంచి జీతం, గౌరవప్రదమైన సర్వీస్ కోసం ఈ అవకాశాన్ని వినియోగించుకోండి.

ఖాళీల వివరాలు:
| ఇంజనీరింగ్ విభాగం | ఖాళీలు |
| ఎలక్ట్రానిక్స్ | 175 |
| మెకానికల్ | 109 |
| కంప్యూటర్ సైన్స్ | 42 |
| ఎలక్ట్రికల్ | 14 |
| మొత్తం | 340 |
Also Read : Bajaj Finance Credit Card Apply Online 2025
అర్హతలు :
BEL Probationary Engineer Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో B.E / B.Tech / B.Sc (Engineering) పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి :
BEL Probationary Engineer Recruitment 2025 అభ్యర్థులకు 01.10.2025 నాటికి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
BEL Probationary Engineer Recruitment 2025 అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు SBI e-Pay Lite ద్వారా ఆన్లైన్ చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS: ₹1000 + GST = ₹1180/-
- SC / ST / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ :
BEL Probationary Engineer Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
Computer Based Test (CBT) – 125 ప్రశ్నలు (100 టెక్నికల్ + 25 రీజనింగ్/అప్టిట్యూడ్)
- సమయం: 120 నిమిషాలు
- నెగటివ్ మార్కింగ్: 0.25
ఇంటర్వ్యూ (15 మార్కులు)
Final Merit: CBT (85%) + Interview (15%)
Also Read : SBI Credit Card Apply Online 2025
జీతం వివరాలు :
BEL Probationary Engineer Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు E-II గ్రేడ్ ప్రకారం ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు ₹40,000 – ₹1,40,000/- వరకు పే స్కేల్ అందిస్తారు.
దరఖాస్తు విధానం :
BEL Probationary Engineer Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్సైట్ www.bel-india.in ను సందర్శించాలి.
- “Careers” సెక్షన్లోకి వెళ్లి “All India External Recruitment 2025” పై క్లిక్ చేయండి.
- కొత్త యూజర్ అయితే “Register” చేయండి.
- అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
- General/OBC/EWS అభ్యర్థులు ఫీజు చెల్లించాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 అక్టోబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 14 నవంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
| Official Website | Click here |
Also Read : ICICI Credit Card Apply Online 2025






