BVFCL Non Executive Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన బ్రహ్మపుత్ర వ్యాలీ ఫర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ (BVFCL), నామ్రూప్ లో వివిధ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 23 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిప్లొమా, డిగ్రీ లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 10వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
ఈ నియామకంలో మొత్తం 23 ఖాళీలు ఉన్నాయి. ప్రతి పోస్టుకు ప్రత్యేక అర్హతలు మరియు విభాగాలు కింద ఇవ్వబడ్డాయి.
- Loco Driver Trainee Gr-II (Mechanical/Electrical) – 01 పోస్టు
- Chemist Trainee Gr-II (Chemical Lab) – 02 పోస్టులు
- Operator Trainee Gr-II (Production) – 03 పోస్టులు
- Boiler Attendant Gr-II – 02 పోస్టులు
- Technician Trainee Gr-II (Instrumentation) – 03 పోస్టులు
- Technician Trainee Gr-II (Mechanical) – 04 పోస్టులు
- Technician Trainee Gr-II (Electrical) – 02 పోస్టులు
- Technician Trainee Gr-II (Civil) – 01 పోస్టు
- Technician Trainee Gr-III (Fitter) – 01 పోస్టు
- Technician Trainee Gr-III (AC Mechanic) – 01 పోస్టు
- Technician Trainee Gr-III (Welder) – 01 పోస్టు
- Technician Trainee Gr-III (Machinist) – 01 పోస్టు
- Technician Trainee Gr-III (Diesel Mechanic) – 01 పోస్టు
అర్హతలు
BVFCL Non Executive Recruitment 2025 ప్రతి పోస్టుకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. అభ్యర్థులు తమ అర్హతను తనిఖీ చేసుకొని దరఖాస్తు చేసుకోవాలి.
- Loco Driver Trainee: మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో 3 సంవత్సరాల డిప్లొమా (50% మార్కులు).
- Chemist Trainee: కెమిస్ట్రీ సబ్జెక్టుతో బీఎస్సీ డిగ్రీ.
- Operator Trainee: కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా లేదా B.Sc (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్) 40% మార్కులతో.
- Boiler Attendant: HSLC + ITI లేదా Boiler Trade లో NAC సర్టిఫికేట్ మరియు కనీసం 5 సంవత్సరాల అనుభవం.
- Technician Trainee (Instrumentation/Mechanical/Electrical/Civil): సంబంధిత బ్రాంచ్లో డిప్లొమా (50% మార్కులు).
- Technician Trainee Gr-III (Fitter/AC Mechanic/Welder/Machinist/Diesel Mechanic): HSLC + సంబంధిత ట్రేడ్లో ITI సర్టిఫికేట్ (NCVT/SCVT).
వయోపరిమితి (Age Limit)
BVFCL Non Executive Recruitment 2025 01 నవంబర్ 2025 నాటికి వయోపరిమితి కింది విధంగా ఉంది:
- Boiler Attendant: గరిష్ట వయస్సు 43 సంవత్సరాలు
- ఇతర పోస్టులు (Gr-II): గరిష్టంగా 30 సంవత్సరాలు
- Technician Trainee Gr-III పోస్టులు: గరిష్టంగా 22 సంవత్సరాలు
- OBC, SC/ST, PwBD మరియు Ex-Servicemen అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
BVFCL Non Executive Recruitment 2025 అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా (నెట్ బ్యాంకింగ్ / కార్డ్) అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- UR / OBC / EWS అభ్యర్థులు: ₹250/-
- SC / ST / PwBD / Ex-Servicemen: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ (Selection Process)
BVFCL Non Executive Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది.
- పరీక్ష విధానం: 100 ప్రశ్నలు – 100 మార్కులు
- సబ్జెక్టులు:
- జనరల్ ఇంగ్లీష్ – 20 మార్కులు
- జనరల్ నాలెడ్జ్ – 20 మార్కులు
- రీజనింగ్ – 20 మార్కులు
- సబ్జెక్ట్ నాలెడ్జ్ – 40 మార్కులు
- Gr-III పోస్టులకు: CBT తర్వాత స్కిల్/ప్రొఫిషెన్సీ టెస్ట్ ఉంటుంది.
- చివరగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ జరుపుతారు.
Also Read : South Indian Bank PO (CMA) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్
జీతం మరియు స్టైపెండ్ వివరాలు
ట్రైనింగ్ సమయంలో అభ్యర్థులకు బేసిక్ + DAలో 75% స్టైపెండ్ చెల్లించబడుతుంది.
- Gr-II పోస్టులు: ₹9,950 + DA
- Gr-III పోస్టులు: ₹9,450 + DA
- ట్రైనింగ్ పూర్తైన తర్వాత అభ్యర్థులు ₹9,450 – ₹22,350/- (పే స్కేల్) తో రెగ్యులర్ ఉద్యోగులుగా నియమించబడతారు.
దరఖాస్తు విధానం (How to Apply)
BVFCL Non Executive Recruitment 2025 అభ్యర్థులు BVFCL అధికారిక వెబ్సైట్ www.bvfcl.com ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ట్రైనింగ్ కాలం
అన్ని పోస్టులకు ట్రైనింగ్ కాలం 1 సంవత్సరం ఉంటుంది. ట్రైనింగ్ పూర్తయ్యాక ఉద్యోగులు రెగ్యులర్ స్కేల్లో కొనసాగుతారు. ఎంపికైన అభ్యర్థులు BVFCL ప్లాంట్, నామ్రూప్ (జిల్లా – డిబ్రుగఢ్, అస్సాం) లో పనిచేయాల్సి ఉంటుంది.
Important Note :
ఈ పోస్టులకు భారతదేశంలోని ఎక్కడి అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, నామ్రూప్ (అస్సాం) లోని స్థానిక Employment Exchange (Namrup) లో మీ పేరు నమోదు చేయడం తప్పనిసరి. అంటే, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ దరఖాస్తు చేసుకునే ముందు లేదా తరువాత Employment Exchange Namrup లో మీ పేరు రిజిస్టర్ చేయాలి.
ఇతర రాష్ట్రాల అభ్యర్థులు ఎలా చేయాలి?
- ఇతర రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా Employment Exchange Namrup లో నమోదు చేసుకోవచ్చు (లేదా ఇమెయిల్ / పోస్టల్ విధానంలో).
- మీరు BVFCL అధికారిక సైట్ లేదా Assam Employment Exchange portal ద్వారా కూడా ఇది చేయవచ్చు.
- ఇది ఒక సాధారణ రిజిస్ట్రేషన్ మాత్రమే — దీని వల్ల అస్సాం నివాసి కావాల్సిన అవసరం లేదు, కానీ ఎంప్లాయ్మెంట్ నంబర్ ఉండాలి అంతే.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం: 10-11-2025
- చివరి తేదీ: 09-12-2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!






