CCI Young Professionals Recruitment 2025 : కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని Competition Commission of India (CCI) నుంచి మరో అద్భుతమైన అవకాశం. భారతదేశంలోని ప్రతిభావంతులైన యువత కోసం యంగ్ ప్రొఫెషనల్ (Young Professionals) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు ఒప్పంద (Contract Basis) పద్ధతిలో భర్తీ చేయబడతాయి. ఎంపికైన వారికి దిల్లీ, ముంబై, చెన్నై కేంద్రాల్లో పని చేసే అవకాశం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు (Vacancy Details)
| విభాగం | పోస్టు పేరు | ఖాళీలు |
| Law | Young Professional (Grade-I) | 09 |
| Economics | Young Professional (Grade-I) | 01 |
| Information Technology (IT) | Young Professional (Grade-I) | 04 |
| మొత్తం | 14 పోస్టులు |
Also Read : NFC Hyderabad Apprentice Recruitment 2025 | NFC హైదరాబాద్ లో 405 ఖాళీలు
అర్హతలు (Eligibility Criteria)
CCI Young Professionals Recruitment 2025 పోస్టు ఆధారంగా విద్యార్హతల వివరాలు మారుతాయి.
1. Law Discipline :
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి LLB లేదా సమానమైన డిగ్రీ ఉండాలి.
- భారతదేశంలోని ఏదైనా స్టేట్ బార్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి.
- కోర్టులు, ట్రిబ్యునల్స్, కార్పొరేట్ లీగల్ విభాగాల్లో అనుభవం అవసరం.
2. Economics Discipline
- ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.
3. IT Discipline
- B.Tech/B.E (Computer Science / IT / ECE) లేదా M.Sc/MCA (Computer Science/IT)
- Cyber Security, Web Development, Data Centre, IT Infrastructureలో అనుభవం.
వయో పరిమితి (Age Limit)
CCI Young Professionals Recruitment 2025 అభ్యర్థులకు 31 అక్టోబర్ 2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు (Application Fee)
CCI Young Professionals Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అన్ని కేటగిరీల అభ్యర్థులు ఉచితంగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం (Selection Process)
CCI Young Professionals Recruitment 2025 అభ్యర్థులను అర్హత, అనుభవం, ఇంటర్వ్యూ ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు.
Also Read : APMSRB AYUSH Recruitment 2025 | ఏపీ ఆయూష్ డిపార్ట్మెంట్ లో భారీ నోటిఫికేషన్
జీతం వివరాలు (Salary Details)
CCI Young Professionals Recruitment 2025 యంగ్ ప్రొఫెషనల్ (Grade-I) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹60,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం పూర్తయినప్పుడు 10% పెంపు (Increment) ఉంటుంది.
దరఖాస్తు విధానం (How to Apply)
CCI Young Professionals Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అభ్యర్థులు Competition Commission of India అధికారిక వెబ్సైట్ www.cci.gov.in సందర్శించాలి.
- ప్రిస్క్రైబ్డ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ నింపాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ (Education & Experience Certificates) స్వయంగా సర్టిఫై చేసి అప్లోడ్ చేయాలి.
- అప్లికేషన్ పూర్తిగా ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 01 డిసెంబర్ 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : TMC Non-Medical Recruitment 2025 | టాటా మెమోరియల్ సెంటర్ లో బంపర్ జబ్స్ – 330 పోస్టులు






