CSIR NBRI MTS Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో MTS జాబ్స్

On: October 28, 2025
CSIR NBRI MTS Recruitment 2025

CSIR NBRI MTS Recruitment 2025 : లక్నోలోని CSIR – National Botanical Research Institute (NBRI) నుండి కొత్త నియామక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 17 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 27వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

CSIR NBRI MTS Recruitment 2025
CSIR NBRI MTS Recruitment 2025

ఖాళీల వివరాలు : 

  • పోస్టు పేరు : మల్టీ టాస్కింగ్ స్టాఫ్(MTS)
  • పోస్టుల సంఖ్య : 17

Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

అర్హతలు : 

CSIR NBRI MTS Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి. 12వ తరగతి ఉత్తీర్ణత ఉంటే ప్రాధాన్యత ఇస్తారు.

వయోపరిమితి : 

CSIR NBRI MTS Recruitment 2025 అభ్యర్థులకు 25.11.2025 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

CSIR NBRI MTS Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

  • జనరల్ / OBC / EWS అభ్యర్థులు: ₹500/- 
  • SC / ST / మహిళలు / దివ్యాంగులు / ఎక్స్-సర్వీస్‌మెన్: ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : 

CSIR NBRI MTS Recruitment 2025  అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుంది. మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. 2 గంటల సమయం ఇస్తరు. ప్రతి సరైన సమాధానానికి 3 మార్కులు, తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కులు ఉంటాయి. రాత పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. 

Also Read : South Western Railway Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్

జీతం వివరాలు : 

CSIR NBRI MTS Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పేలెవల్-1 ప్రకారం రూ.18,000 – రూ.56,900/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు రూ.38,155/- జీతం అందుతుంది. 

దరఖాస్తు విధానం : 

CSIR NBRI MTS Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://www.nbri.res.in లో వెళ్లాలి. 
  • రిక్రూట్మెంట్ విభాగంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫారం నింపాలి. 
  • అవసమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 27 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 25 నవంబర్, 2025
  • పరీక్ష తేదీ : డిసెంబర్, 2025 మూడో వారం (అంచనా)
NotificationClick here
Apply OnlineClick here

Also Read : UoH Non-Teaching Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్

Leave a Comment

Follow Google News