CWC Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన Central Warehousing Corporation (CWC), ఒక నవరత్న పబ్లిక్ సెక్టార్ సంస్థ. వ్యవసాయ ఉత్పత్తులు మరియు లాజిస్టిక్స్ సేవలకు సంబంధించిన శాస్త్రీయ నిల్వ సదుపాయాలను అందిస్తోంది. ఈ సంస్థలో Young Professionals పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడులైంది. మొత్తం 11 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీ నుంచి నవంబర్ 25వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు
CWCలోని వివిధ విభాగాలు మరియు ప్రాంతాల్లో ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి
- Young Professional (Legal) – 1 పోస్టు – న్యాయ విభాగం, న్యూ ఢిల్లీ
- Young Professional (Learning & Development) – 2 పోస్టులు – హెచ్.ఆర్. విభాగం, న్యూ ఢిల్లీ & హాపూర్
- Young Professional (Business Analytics) – 1 పోస్టు – మార్కెటింగ్ విభాగం, న్యూ ఢిల్లీ
- Young Professional (Marketing & Business Development)
- అహ్మదాబాద్ – 1 పోస్టు
- భోపాల్ – 1 పోస్టు
- ఢిల్లీ – 1 పోస్టు
- గౌహతి – 1 పోస్టు
- హైదరాబాద్ – 1 పోస్టు
- కొచ్చి – 1 పోస్టు
- పంచకులా – 1 పోస్టు
మొత్తం: 11 పోస్టులు
Also Read : CAU Recruitment 2025 | 174 ఫ్యాకల్టీ పోస్టులు – జీతం ₹2 లక్షల వరకు – ఇప్పుడే దరఖాస్తు చేయండి!
అర్హతలు
CWC Recruitment 2025 ప్రతి పోస్టుకు అవసరమైన విద్యార్హతలు ఇలా ఉన్నాయి.
- Legal: LLB లేదా LLM డిగ్రీ (పూర్తిస్థాయి కోర్సు)
- Learning & Development: MBA / PGDM (Human Resources స్పెషలైజేషన్‌తో)
- Business Analytics: MSc / MA / BSc / BBA / MBA (Statistics / Data Science / Business Analytics స్పెషలైజేషన్‌తో)
- Marketing & Business Development: MBA / PGDM (Marketing / Logistics / Supply Chain Management / Sales Management స్పెషలైజేషన్‌తో)
ఈ పోస్టులకు 0 నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న అభ్యర్థులు, లేదా 3 సంవత్సరాలకంటే ఎక్కువ అనుభవం ఉన్నవారు అప్లై చేయవచ్చు.
వయోపరిమితి
CWC Recruitment 2025 అభ్యర్థులకు 25 నవంబర్ 2025 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీకి సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు
CWC Recruitment 2025 నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థులు ఎలాంటి చెల్లింపు చేయాల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం
CWC Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పర్సనల్ ఇంటరాక్షన్ (Interview) ద్వారా జరుగుతుంది. సంస్థ అవసరానికి అనుగుణంగా Shortlisting కూడా చేయవచ్చు. ఎంపికైనవారికి సంబంధిత రీజినల్ ఆఫీస్ లేదా ప్రాజెక్ట్ సైట్లలో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.
Also Read : Andhra University Recruitment 2025 | ఆంధ్ర యూనివర్సిటీలో బంపర్ జాబ్స్
జీతం వివరాలు
CWC Recruitment 2025 అభ్యర్థి అనుభవాన్ని బట్టి జీతం ఇలా ఉంటుంది.
| అనుభవం | నెలసరి వేతనం (రూ.) |
| 0 – 3 సంవత్సరాలు | ₹50,000/- (కన్సాలిడేటెడ్) |
| 3 సంవత్సరాలకు పైగా | ₹60,000/- (కన్సాలిడేటెడ్) |
జీతంలో అన్ని పన్నులు కలిపి ఉంటాయి. ఇతర అలవెన్సులు ఉండవు.
దరఖాస్తు విధానం
CWC Recruitment 2025 అభ్యర్థులు CWC అధికారిక వెబ్సైట్ www.cewacor.nic.in ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 12 నవంబర్ 2025
- చివరి తేదీ: 25 నవంబర్ 2025 (రాత్రి 11:59 వరకు)
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : IPPB Recruitment 2025 | పోస్టల్ లో కొత్త నోటిఫికేషన్ విడుదల






