KVS PM–SHRI PMU Recruitment 2025 : భారత ప్రభుత్వం విద్యాశాఖకు చెందిన కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (Kendriya Vidyalaya Sangathan – KVS) లో “PM-SHRI PMU (PM School for Rising India Project Management Unit)” ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాలను EdCIL (India) Ltd., కేంద్ర ప్రభుత్వ మినీ రత్న సంస్థ, నిర్వహిస్తుంది. అకౌంటెంట్ మరియు ఐటీ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు నవంబర్ 10వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దేశవ్యాప్తంగా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 3
- అకౌంటెంట్ : 1
- ఐటీ స్టాఫ్ : 2
Also Read : Rubber Board Recruitment 2025 | రబ్బర్ బోర్డులో బంపర్ నోటిఫికేషన్
అర్హతలు :
KVS PM–SHRI PMU Recruitment 2025 పోస్టు ఆధారంగా విద్యార్హతల్లో మార్పు ఉంటుంది.
అకౌంటెంట్ :
- M.Com / B.Com / B.Sc (Mathematics) లో కనీసం 60% మార్కులు.
- కనీసం 3 సంవత్సరాల అనుభవం ప్రభుత్వ సంస్థ / లిమిటెడ్ కంపెనీ / ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్‌లో ఉండాలి.
ఐటీ స్టాఫ్ :
- BCA / B.Sc (Computer Science / IT / Mathematics) లేదా B.Tech (Computer Science / IT) రెగ్యులర్ కోర్సు ద్వారా పూర్తి చేసి ఉండాలి.
- కనీసం 3 సంవత్సరాల అనుభవం సంబంధిత పోస్టులో ఉండాలి.
- MS Word, Excel, PowerPoint లో మంచి పరిజ్ఞానం ఉండాలి.
- ఇంగ్లీష్ టైపింగ్ వేగం కనీసం 30 wpm ఉండాలి.
వయోపరిమితి :
KVS PM–SHRI PMU Recruitment 2025 అభ్యర్థులకు 30.09.2025 నాటికి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్ ఫీజు :
KVS PM–SHRI PMU Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
KVS PM–SHRI PMU Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక అకాడమిక్ అర్హతలు, అనుభవం, మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది. షార్ట్‌లిస్టు అయిన అభ్యర్థులకు మాత్రమే ఇమెయిల్ ద్వారా ఇంటర్వ్యూ వివరాలు పంపబడతాయి. అవసరమైతే వెయిటింగ్ లిస్ట్ కూడా సిద్ధం చేస్తారు.
Also Read : APEDA Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో బంపర్ జాబ్స్
జీతం వివరాలు :
KVS PM–SHRI PMU Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. మొదట 1 సంవత్సరం కాంట్రాక్ట్, తరువాత పనితీరు ఆధారంగా పొడిగించవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
- అప్లికేషన్ లింక్ https://forms.gle/gRySPR4xDrm5zcHe6
- అవసరమైన డాక్యుమెంట్లు (విద్య, అనుభవం, ఫోటో, రెజ్యూమ్ మొదలైనవి) PDF ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 10 నవంబర్ 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు






