Military College of EME Recruitment 2025 : ఇండియన్ ఆర్మీలో భాగమైన Military College of Electronics and Mechanical Engineering (MCEME), సికింద్రాబాద్ లో గ్రూప్‘సి’ సివిలియన్ పోస్టుల భర్తీ కోసం తాజా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మరియు ఇతర పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంజనీరింగ్, సైన్స్, టెక్నికల్ లేదా 10వ/12వ తరగతి అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఈ ఉద్యోగాలు సెంట్రల్ గవర్నమెంట్‌లో నేరుగా నియామకం (Direct Recruitment) ద్వారా చేస్తున్నారు.

ఖాళీల వివరాలు :
| పోస్టు పేరు | ఖాళీలు |
| Lower Division Clerk (LDC) | 05 |
| Stenographer Grade-II | 02 |
| Laboratory Assistant | 03 |
| Civilian Motor Driver (OG) | 01 |
| Bootmaker Equipment Repairer | 02 |
| Barber | 01 |
| Multi Tasking Staff (MTS) | 25 |
| Tradesman Mate | 10 |
| మొత్తం పోస్టులు | 49 |
Also Read : IB ACIO Tech Notification 2025 | ఇంటెలిజెన్స్ బ్యూరోలో 258 టెక్నికల్ పోస్టులు
అర్హతలు:
Military College of EME Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు గమనించి దరఖాస్తు చేసుకోగలరు.
Lower Division Clerk (LDC):
- 12వ తరగతి ఉత్తీర్ణులు.
- కంప్యూటర్‌లో ఇంగ్లీష్ టైపింగ్ 35 wpm లేదా హిందీలో 30 wpm.
2. Stenographer Grade-II:
- 12వ తరగతి ఉత్తీర్ణులు.
- షార్ట్‌హ్యాండ్ స్పీడ్: 80 wpm
- ట్రాన్స్‌క్రిప్షన్ టైం: ఇంగ్లీష్ 50 నిమిషాలు / హిందీ 65 నిమిషాలు.
3. Laboratory Assistant:
- సైన్స్ గ్రాడ్యుయేట్ (Physics, Chemistry, Mathematics) లేదా Diploma in Electrical/Mechanical/Electronics.
- 2 సంవత్సరాల అనుభవం ఉండడం మంచిది.
4. Civilian Motor Driver (OG):
- 10వ తరగతి ఉత్తీర్ణులు.
- హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ + 2 సంవత్సరాల అనుభవం.
5. Bootmaker / Equipment Repairer:
- 10వ తరగతి ఉత్తీర్ణులు.
- లెదర్ మరియు కాన్వాస్ వస్తువుల రిపేర్ చేయగల నైపుణ్యం.
6. Barber:
- 10వ తరగతి ఉత్తీర్ణులు + హెయిర్ కటింగ్ ట్రేడ్‌లో అనుభవం.
7. MTS / Tradesman Mate:
- 10వ తరగతి ఉత్తీర్ణులు.
- సంబంధిత పనిలో అనుభవం ఉంటే అదనపు ప్రయోజనం.
వయోపరిమితి :
Military College of EME Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Military College of EME Recruitment 2025 అధికారిక నోటిఫికేషన్‌లో ఫీజు ప్రస్తావన లేదు. అభ్యర్థులు పోస్టల్ స్టాంప్ ₹10/-తో కూడిన సెల్ఫ్ అడ్రెస్డ్ కవర్ సమర్పించాలి.
ఎంపిక ప్రక్రియ :
Military College of EME Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- షార్ట్ లిస్టింగ్ : అభ్యర్థులను అర్హత మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్ (అవసరమైతే)
Also Read : ISRO SAC Recruitment 2025 | ఇస్రోలో టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
జీతం వివరాలు :
| పోస్టు | పే లెవల్ |
| LDC, డ్రైవర్ | Level-2 (₹19,900 – ₹63,200) |
| Stenographer, Lab Assistant | Level-4 (₹25,500 – ₹81,100) |
| Bootmaker, Barber, MTS, Tradesman Mate | Level-1 (₹18,000 – ₹56,900) |
దరఖాస్తు విధానం :
Military College of EME Recruitment 2025 అభ్యర్థులు ఆఫ్ లైన్ మోడ్ లో దరఖాస్తులు సమర్పించాలి.
- నోటిఫికేషన్ లో ఇచ్చిన నిర్ణీత ఫార్మాట్ ప్రకారం అప్లికేషన్ ఫారమ్ సిద్ధం చేసుకోవాలి.
- రూ.10/- పోస్టల్ స్టాఫ్ తో స్వీయ చిరునామా ఉన్న కవరు జత చేయాలి.
- కవర్‌పై “APPLICATION FOR THE POST OF _______” అని తప్పనిసరిగా రాయాలి.
- దరఖాస్తు సాధారణ పోస్టు (Ordinary Post) ద్వారా పంపాలి.
- దరఖాస్తు పంపే చిరునామా : The Commandant, Military College of Electronics and Mechanical Engineering (MCEME), PIN – 900453, C/o 56 APO, Secunderabad, Telangana.
దరఖాస్తులకు చివరి తేదీ : నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజులు
| Notification | Click here |
Also Read : BEL Probationary Engineer Recruitment 2025 | BEL భారీ నోటిఫికేషన్ – 340 ఇంజనీర్ పోస్టులు






