National Sanskrit University Tirupati Recruitment 2025 : తిరుపతిలోని నేషనల్ సంస్కృత యూనివర్సిటీ (National Sanskrit University, Tirupati) నుంచి కొత్త నియామక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా వివిధ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 8 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10వ తరగతి నుండి పీజీ వరకు ఉన్నవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
- లైబ్రేరియన్ : 01
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ : 01
- ప్రొఫెషనల్ అసిస్టెంట్ : 01
- లాబొరేటరీ అసిస్టెంట్ : 02
- అప్పర్ డివిజన్ క్లర్క్ : 01
- లైబ్రరీ అటెండెంట్ : 02
- గ్రూప్ ‘సి’ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 01
మొత్తం ఖాళీల సంఖ్య : 8
Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్
అర్హతలు మరియు వయోపరిమితి :
లైబ్రేరియన్ :
- విద్యార్హతలు : లైబ్రరీ సైన్స్ / ఇన్ఫర్మేషన్ సైన్స్ / డాక్యుమెంటేషన్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (55% మార్కులు) + కనీసం 10 సంవత్సరాల అనుభవం యూనివర్సిటీ లేదా కాలేజ్ లైబ్రరీలో ఉండాలి. + లైబ్రరీ సైన్స్‌లో పీహెచ్.డి. ఉండాలి. + కంప్యూటర్ మరియు ICT వ్యవస్థల పరిజ్ఞానం ఉండాలి.
- వయోపరిమితి : 57 సంవత్సరాలు లోపు ఉండాలి.
అసిస్టెంట్ రిజిస్ట్రార్ :
- విద్యార్హతలు : ఏదైనా సబ్జెక్ట్‌లో మాస్టర్స్ డిగ్రీ (55% మార్కులు).
- వయోపరిమితి : 40 సంవత్సరాలు లోపు.
ప్రొఫెషనల్ అసిస్టెంట్ :
- విద్యార్హతలు : Library & Information Scienceలో మాస్టర్స్ డిగ్రీ మరియు 2 సంవత్సరాల అనుభవం లేదా Library Scienceలో బ్యాచిలర్ డిగ్రీ మరియు 3 సంవత్సరాల అనుభవం + కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
- వయోపరిమితి : 35 సంవత్సరాలు లోపు
లాబొరేటరీ అసిస్టెంట్ (ఎడ్యుకేషన్) :
- విద్యార్హతలు : Siksha Sastri / B.Ed పూర్తి చేయాలి. + 1 సంవత్సరం ల్యాబ్ అనుభవం ఉండాలి. + కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. + సంస్కృత పరిజ్ఞానం ఉంటే ప్రాధాన్యత.
- వయోపరిమితి : 32 సంవత్సరాలు లోపు
లాబొరేటరీ అసిస్టెంట్ (లాంగ్వేజ్ ల్యాబ్ అండ్ టెక్నాలజీ ల్యాబ్):
- విద్యార్హతలు : Siksha Sastri / B.Ed పూర్తి చేయాలి. + ICT పరికరాల అనుభవం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.+ సంస్కృత పరిజ్ఞానం ప్రాధాన్యత.
- వయోపరిమితి : 32 సంవత్సరాలు లోపు
అప్పర్ డివిజన్ క్లర్క్ :
- విద్యార్హతలు : బ్యాచిలర్ డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం LDC / సమానమైన పోస్టులో + ఇంగ్లీష్ టైపింగ్ @35 wpm లేదా హిందీ టైపింగ్ @30 wpm + కంప్యూటర్ ఆపరేషన్స్‌లో నైపుణ్యం ఉండాలి.
- వయోపరిమితి : 32 సంవత్సరాలు లోపు
లైబ్రరీ అటెండెంట్ :
- విద్యార్హతలు : 10+2 లేదా సమానమైన అర్హత + Library Science సర్టిఫికేట్ కోర్సు + 1 సంవత్సరం అనుభవం లైబ్రరీలో + కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి
- వయోపరిమితి : 32 సంవత్సరాలు లోపు
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ :
- విద్యార్హతలు : 10వ తరగతి లేదా ITI ఉత్తీర్ణత
- వయోపరిమితి : 32 సంవత్సరాల లోపు
అప్లికేషన్ ఫీజు :
National Sanskrit University Tirupati Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- UR/OBC/EWS పురుష అభ్యర్థులు: ₹800/-
- SC/ST/PwBD/మహిళలు: ఫీజు మినహాయింపు.
ఎంపిక ప్రక్రియ :
National Sanskrit University Tirupati Recruitment 2025 ఎంపిక పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హత, అనుభవం, మరియు నైపుణ్యం ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. ఇంటర్వ్యూ కాల్ లెటర్లు కేవలం ఇమెయిల్ ద్వారా పంపబడతాయి.
Also Read : NI-MSME Recruitment 2025 | NI-MSME హైదరాబాద్ లో జాబ్స్
జీతం వివరాలు :
National Sanskrit University Tirupati Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది.
- Librarian: ₹1,44,200/- వరకు (Level 14)
- Assistant Registrar: ₹56,100/- వరకు (Level 10)
- Professional Assistant: ₹35,400/- వరకు (Level 6)
- Lab Assistants / UDC: ₹25,500/- వరకు (Level 4)
- Library Attendant: ₹19,900/- వరకు (Level 2)
- MTS: ₹18,000/- వరకు (Level 1)
దరఖాస్తు విధానం :
National Sanskrit University Tirupati Recruitment 2025 అభ్యర్థులు ముందుగా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి. ఆ తర్వాత హార్డ్ కాపీ పంపాల్సి ఉంటుంది.
- అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://nsktunt.samarth.edu.in లోకి వెళ్లాలి.
- “Non-Teaching Recruitment” సెక్షన్‌లోకి వెళ్లి సరైన పోస్టును ఎంచుకోండి.
- ఆన్‌లైన్ ఫారమ్ నింపి, అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి.
- అవసరమైతే ఫీజు చెల్లించండి.
- దరఖాస్తు ప్రింట్ తీసుకుని కింది చిరునామాకు పంపండి.
దరఖాస్తు పంపాల్సిన అడ్రస్ :
- The Registrar, National Sanskrit University, Tirupati – 517507, Andhra Pradesh.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 30.11.2025 (రాత్రి 11:59 వరకు)
- హార్డ్ కాపీ సమర్పణ చివరి తేదీ: 10.12.2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : South Western Railway Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్






