NEEPCO Executive Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

On: October 29, 2025
NEEPCO Executive Trainee Recruitment 2025

NEEPCO Executive Trainee Recruitment 2025 : ప్రముఖ విద్యుత్ ఉత్పత్తి సంస్థ North Eastern Electric Power Corporation Limited (NEEPCO) కొత్త నియామక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సంస్థలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నియామకాలు Electrical/Mechanical, Civil మరియు IT విభాగాలలో జరుగుతున్నాయి. GATE 2025 స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీ నుంచి నవంబర్ 17వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. ఈ పోస్టులకు దేశవ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతిఒక్కరూ అప్లయ్ చేసుకోవచ్చు. 

NEEPCO Executive Trainee Recruitment 2025
NEEPCO Executive Trainee Recruitment 2025

ఖాళీల వివరాలు : 

  • పోస్టు పేరు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
  • మొత్తం పోస్టుల సంఖ్య : 30
పోస్టు విభాగంఖాళీలు
ఎలక్ట్రికల్ / మెకానికల్18
సివిల్10
ఐటీ02

Also Read : BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్

అర్హతలు : 

NEEPCO Executive Trainee Recruitment 2025 అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో కనీసం 65% మార్కులు (SC/ST – 55%)లతో BE / B.Tech ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాల్లో  GATE 2025  పరీక్షలో అర్హత తప్పనిసరి.

వయోపరిమితి : 

 NEEPCO Executive Trainee Recruitment 2025 అభ్యర్థులకు 01-07-2025 నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

NEEPCO Executive Trainee Recruitment 2025 అభ్యర్థులు SBI ePay ద్వారా మాత్రమే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • General / OBC (NCL) / EWS: ₹560/-
  • SC / ST / PwBD / ESM / మహిళలు: ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ : 

NEEPCO Executive Trainee Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా GATE 2025 స్కోర్ ఆధారంగా జరుగుతుంది. ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ఉండదు. సమాన మార్కులు వస్తే, పెద్ద వయస్సు ఉన్న అభ్యర్థికి ప్రాధాన్యం ఇస్తారు.

Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

NEEPCO Executive Trainee Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు E-2 Grade – IDA ప్రకారం రూ.50,000 – రూ.1,60,000/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు అన్ని అలవెన్సులు కలుపుకొని నెలకు సుమారు రూ.1,00,000/- జీతం అందుతుంది. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేయాలి. భారత్‌లోని ఏ ప్రాజెక్ట్/ఆఫీసులోనైనా పోస్టింగ్ పొందవచ్చు.

దరఖాస్తు విధానం : 

NEEPCO Executive Trainee Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వాారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్‌  https://neepco.co.in ఓపెన్ చేయాలి. 
  • “Careers Section” లో “Executive Trainee Recruitment 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
  • GATE 2025 రిజిస్ట్రేషన్ నంబర్ & వివరాలు ఎంటర్ చేయండి.
  • అవసరమైన పత్రాలు (మార్క్ షీట్లు, కేటగిరీ సర్టిఫికేట్లు, GATE స్కోర్‌కార్డ్, ఫోటో, సంతకం) అప్‌లోడ్ చేయండి.
  • ఫీజు చెల్లించండి (అవసరమైతే) మరియు ఫారమ్ సబ్మిట్ చేయండి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 28 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 17 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : South Western Railway Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్

1 thought on “NEEPCO Executive Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు”

Leave a Comment

Follow Google News