NFC Hyderabad Apprentice Recruitment 2025 : భారత ప్రభుత్వం ఆధీనంలోని న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ (Nuclear Fuel Complex – NFC), హైదరాబాద్ సంస్థలో 2025-26 సంవత్సరానికి ITI ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 405 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 15వ తేదీలోపు ఆన్ లైేన్ లో దరఖాస్తు చేసుకోగలరు. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత గల అభ్యర్థులు ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఒక సంవత్సరం కాలానికి ఉంటుంది. ఎంపిక పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.

ఖాళీల వివరాలు :
మొత్తం ఖాళీల సంఖ్య : 405
- ఫిట్టర్ : 126
- టర్నర్ : 35
- ఎలక్ట్రీషియన్ : 53
- మెషినిస్ట్ : 17
- కెమికల్ ప్లాంట్ ఆపరేటర్ : 23
- ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్ : 19
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్ : 24
- లాబొరేటరీ అసిస్టెంట్ (కెమికల్ ప్లాంట్) : 1
- మోటార్ మెకానిక్(వెహికల్) : 4
- డ్రాఫ్ట్స్ మెన్(మెకానికల్) : 3
- కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ : 59
- డీజిల్ మెకానిక్ : 4
- కార్పెంటర్ : 5
- ప్లంబర్ 5
- వెల్డర్ : 26
- స్టెనోగ్రాఫర్ : 1
Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు
అర్హతలు :
NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులు 10వ తరగతి (SSC) పాస్ అయి ఉండాలి. దీంతో పాటు సంబంధిత ITI ట్రేడ్లో పాస్ (NCVT/SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులకు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ :
NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక పూర్తిగా మెరిట్ మార్కుల ఆధారంగా జరుగుతుంది.
- Electrician ట్రేడ్ కోసం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది.
- మిగతా ట్రేడ్లకు అభ్యర్థుల ITI మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు తయారు చేస్తారు. మార్కులు సమానంగా ఉంటే 10వ తరగతి మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు.
Also Read : BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్
స్టైఫండ్ :
NFC Hyderabad Apprentice Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,600/- నుంచి రూ.10,560/- వరకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఎంపికైన వారికి Nuclear Fuel Complex (NFC), హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది.
దరఖాస్తు విధానం :
NFC Hyderabad Apprentice Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేయాలి.
- అభ్యర్థులు ముందుగా NAPS పోర్టల్ (www.apprenticeshipindia.gov.in) లో రిజిస్టర్ కావాలి.
- ఆ తర్వాత Nuclear Fuel Complex, Hyderabad (Establishment Code: E11153600013) ఎంపిక చేసి అప్లై చేయాలి.
- అవసరమైన సర్టిఫికేట్లు — 10వ క్లాస్, ITI, కుల/వికలాంగత సర్టిఫికేట్లు (అవసరమైతే) — పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ : 15 నవంబర్, 2025
| Notification | Click here |
| Official Website | Click here |
Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్






