NIA Recruitment 2025 Apply Online | ఆయుర్వేద ఇన్ స్టిట్యూట్ లో బంపర్ జాబ్స్

On: October 24, 2025
NIA Recruitment 2025

NIA Recruitment 2025 Apply Online : దేశంలోని ప్రసిద్ధ జాతీయ ఆయుర్వేద సంస్థ, జైపూర్ (National Institute of Ayurveda – NIA) నుండి కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైంది. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రేడియాలజిస్ట్, నర్సింగ్ స్టాఫ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అక్టోబర్ 24వ తేదీ నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

nia-recruitment-2025
nia-recruitment-2025

ఖాళీల వివరాలు (Vacancy Details) : 

మొత్తం పోస్టులు : 19

పోస్టు పేరుఖాళీలు
ప్రొఫెసర్ (Shalakya Tantra)1
అసిస్టెంట్ ప్రొఫెసర్ (విభిన్న విభాగాలు)4
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్1
రేడియాలజిస్టు1
నర్సింగ్ సూపరింటెండెంట్1
నర్సింగ్ ఆఫీసర్ (Ayurveda & Modern)2
పర్సనల్ అసిస్టెంట్1
జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్1
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)7

అర్హతలు (Eligibility) :   

NIA Recruitment 2025 Apply Online ప్రతి పోస్టుకు సంబంధించిన విద్యార్హతలు, అనుభవం వేర్వేరుగా ఉంటాయి. 

  • ప్రొఫెసర్ : ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ + 15 సంవత్సరాల అనుభవం
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ : ఆయుర్వేదం మరియు సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ
  • రేడియాలజిస్టు : రేడియాలజీలో ఎండీ లేదా డీఎన్బీతో ఎంబీబీఎస్
  • నర్సింగ్ ఆఫీసర్ : బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మిడ్ వైఫరీలో డిప్లొమా
  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) : 10వ తరగతి ఉత్తీర్ణత 

వయోపరిమితి (Age Limit):

NIA Recruitment 2025 ప్రతి పోస్టుకు వయోపరిమితి వేర్వేరుగా ఉంటుంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ నియమాల ప్రకారం రిజర్వేషన్ వయో సడలింపు వర్తిస్తుంది. పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చూడాలి.

అప్లికేషన్ ఫీజు (Application Fee): 

NIA Recruitment 2025 Apply Online అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

పోస్టు పేరుజనరల్ / ఓబీసీ అభ్యర్థులకు ఫీజుఎస్సీ / ఎస్టీ / EWS అభ్యర్థులకు ఫీజు
ప్రొఫెసర్రూ.5,000/-రూ.4,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రేడియాలజిస్ట్, నర్సింగ్ డిప్యూటీరూ.4,000/-రూ.3,000/-
నర్సింగ్ ఆఫీసర్రూ.3,000/-రూ.2,000/-
జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, పర్సనల్ అసిస్టెంట్రూ.2,500/-రూ.2,000/-
మల్టీ టాస్కింగ్ స్టాఫ్రూ.2,000/-రూ.1,800/-

ఎంపిక ప్రక్రియ (Selection Process):

NIA Recruitment 2025 అభ్యర్థులను ఇంటర్వ్యూ / రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ప్రతి పోస్టుకు సంబంధించి ఎంపిక విధానం నోటిఫికేషన్‌లో స్పష్టంగా ఇవ్వబడింది.

జీతం వివరాలు(Salary Details):

NIA Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ వేతన నియమాల ప్రకారం మంచి జీతం చెల్లించబడుతుంది. పోస్టు ఆధారంగా Pay Matrix Level మారుతుంది. 

పోస్టు పేరుజీతం
ప్రొఫెసర్ (Shalakya Tantra)రూ.1,23,100 – 2,15,900
అసిస్టెంట్ ప్రొఫెసర్ (విభిన్న విభాగాలు)రూ.1,23,100 – 2,15,900
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్రూ.56,100 – 1,77,500
రేడియాలజిస్టురూ.56,100 – 1,77,500
నర్సింగ్ సూపరింటెండెంట్రూ.56,100 – 1,77,500
నర్సింగ్ ఆఫీసర్ (Ayurveda & Modern)రూ.44,900 -1,42,400
పర్సనల్ అసిస్టెంట్రూ.35,400 – 1,12,400
జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్రూ.29,200 – 92,300
మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS)రూ.18,000- 56,900

దరఖాస్తు విధానం (How to Apply) : 

NIA Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

  • అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌  www.nia.nic.in లోకి వెళ్లాలి.
  • Recruitment / Vacancy Notification No. 1/2025” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
  • Apply Online” అనే ఆప్షన్‌ ద్వారా దరఖాస్తు ఫారమ్‌ ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 24 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 5 డిసెబర్, 2025
NotificationClick here
Official WebsiteClick here

Leave a Comment

Follow Google News