NPCC Recruitment 2025: NPCCలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు – వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక!

On: October 30, 2025
NPCC Recruitment 2025

NPCC Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన National Projects Construction Corporation Limited (NPCC), ఒక మినీ రత్న కేటగిరీ-I సంస్థ. ఈ సంస్థ నుంచి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 24 నుంచి నవంబర్ 26వ తేదీ వరకు జమ్మూలోని NPCC నార్తన్ జోనల్ కార్యాలయంలో జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. 

NPCC Recruitment 2025
NPCC Recruitment 2025

ఖాళీల వివరాలు

  • సైట్ ఇంజనీర్(సివిల్) : 10
  • సైట్ ఇంజనీర్ (MEP) : 2
  • జూనియర్ ఇంజనీర్(సివిల్) : 4
  • అసిస్టెంట్(ఆఫీస్ సపోర్ట్) : 2

మొత్తం పోస్టుల సంఖ్య : 18

Also Read : NHAI Recruitment 2025 | నేషనల్ హైవేస్ లో బంపర్ జాబ్స్

అర్హతలు : 

NPCC Recruitment 2025 పోస్టును బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

  • Site Engineer (Civil): B.E./B.Tech in Civil Engineering (UGC/AICTE గుర్తింపు కలిగిన యూనివర్సిటీ నుండి)
  • Site Engineer (MEP) : B.E./B.Tech in Mechanical లేదా Electrical Engineering
  • Junior Engineer (Civil) : Diploma in Civil Engineering (3 సంవత్సరాల రెగ్యులర్ కోర్సు)
  • Assistant (Office Support) : ఏదైనా డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేషన్, కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ 50 W.P.M ఉండాలి.

వయోపరిమితి : 

NPCC Recruitment 2025  అభ్యర్థులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/OBC/EWS/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం : 

NPCC Recruitment 2025 అభ్యర్థులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. 

 వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు:

పోస్టు పేరుతేదీస్థలం
Site Engineer (Civil)24.11.2025NPCC Ltd., Northern Zonal Office, 822-A, Gandhi Nagar, Jammu – 180004
Site Engineer (MEP)25.11.2025NPCC Ltd., Northern Zonal Office, 822-A, Gandhi Nagar, Jammu – 180004
Junior Engineer (Civil)25.11.2025NPCC Ltd., Northern Zonal Office, 822-A, Gandhi Nagar, Jammu – 180004
Assistant (Office Support)26.11.2025NPCC Ltd., Northern Zonal Office, 822-A, Gandhi Nagar, Jammu – 180004

గేట్ ఎంట్రీ సమయం: ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు (తర్వాత ఎంట్రీ లేదు)

 అవసరమైన పత్రాలు : 

  • అసలు సర్టిఫికేట్లు మరియు ఫోటోకాపీలు (వయస్సు, విద్య, అనుభవం, కేటగిరీ సర్టిఫికేట్లు)
  • Assistant (Office Support) కోసం టైపింగ్ స్పీడ్ సర్టిఫికేట్ తప్పనిసరి.
  • ప్రభుత్వ ఉద్యోగులైతే NOC (No Objection Certificate) తీసుకురావాలి.

Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

జీతం వివరాలు : 

NPCC Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. 

  • సైట్ ఇంజనీర్(సివిల్/MEP) : రూ.33,750/-
  • జూనియర్ ఇంజనీర్(సివిల్) : రూ.26,650/-
  • అసిస్టెంట్ (ఆఫీస్ సపోర్ట్) : రూ.25,000/-

దరఖాస్తు విధానం : 

NPCC Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.npcc.gov.in ని సందర్శించాలి. 
  • దరఖాస్తు ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి. 
  • ఫారమ్ పూర్తిగా నింపాలి. దీనికి ఇటీవలి పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను జత చేయాలి. 
  • అన్ని ఒరిజనల్ మరియు స్వీయధ్రువీకరించిన పత్రాలను అప్లకేషన్ తో పాటు ఇంటర్వ్యూకు హాజరుకావాలి. 


ఎవరు అప్లయ్ చేయాలి?

ఈ పోస్టులకు భారత పౌరులందరూ, అంటే దేశంలోని ఎక్కడి నుంచైనా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ పోస్టులు NPCC Northern Zone (జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ ప్రాంతాలకు సంబంధించిన ప్రాజెక్టుల కోసం) కావున,  ఎంపికైన అభ్యర్థులు ఆ ప్రాంతాల్లోనే పోస్టింగ్ పొందే అవకాశం ఎక్కువ. అంటే మీరు దేశంలోని ఎక్కడి నుంచైనా అప్లై చేయవచ్చు,
కానీ జాబ్ లొకేషన్ మాత్రం నార్తర్న్ ఇండియా (J&K, HP, Ladakh) లో ఉంటుంది.

Notification & ApplicationClick here
Official WebsiteClick here

Also Read : NPCIL Recruitment 2025 | NPCILలో డిప్యూటీ మేనేజర్ జాబ్స్

Leave a Comment

Follow Google News