PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు

On: November 3, 2025
PNB LBO Recruitment 2025

PNB LBO Recruitment 2025 : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.  ఈ నియామకాలు వివిధ రాష్ట్రాల వారీగా జరుగుతాయి. మొత్తం 750 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 3వ తేదీ నుంచి నవంబర్ 23వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు. 

PNB LBO Recruitment 2025
PNB LBO Recruitment 2025

ఖాళీల వివరాలు: 

మొత్తం 750 పోస్టులు రాష్ట్రాల వారీగా కేటాయించబడ్డాయి. అభ్యర్థి ఒకే రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక అయినవారు ఆ రాష్ట్రంలోనే తొమ్మిది సంవత్సరాలు లేదా పదోన్నతి పొందే వరకు పని చేయాల్సి ఉంటుంది.

  • ఆంధ్రప్రదేశ్‌: 5 పోస్టులు
  • తెలంగాణ: 88 పోస్టులు
  • తమిళనాడు: 85 పోస్టులు
  • మహారాష్ట్ర: 135 పోస్టులు
  • గుజరాత్: 95 పోస్టులు
  • కర్ణాటక: 85 పోస్టులు
  • ఇతర రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి. 

Also Read : KVS PM–SHRI PMU Recruitment 2025 | విద్యాశాఖలో కొత్త నోటిఫికేషన్!

అర్హతలు : 

PNB LBO Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

  • ఏదైనా డిగ్రీ ఉండాలి. 
  • కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
  • భాషా పరిజ్ఞానం: అభ్యర్థి దరఖాస్తు చేసే రాష్ట్ర భాష చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి.

వయోపరిమితి : 

PNB LBO Recruitment 2025 అభ్యర్థులకు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

PNB LBO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • SC/ST/PwBD: ₹59 (₹50 + GST)
  • ఇతర అభ్యర్థులు : ₹1180 (₹1000 + GST)

ఎంపిక ప్రక్రియ : 

PNB LBO Recruitment 2025 పంజాబ్ నేషనల్ బ్యాంకులో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు అభ్యర్థుల ఎంపిక 4 దశల్లో జరుగుతుంది. 

  • ఆన్‌లైన్ రాత పరీక్ష (Online Written Test)
  • డాక్యుమెంట్ స్క్రీనింగ్
  • లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (LLPT)
  • పర్సనల్ ఇంటర్వ్యూ

Also Read : APEDA Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో బంపర్ జాబ్స్

జీతం వివరాలు : 

PNB LBO Recruitment 2025 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480/- నుంచి రూ.85,920/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అదనంగా డియర్నెస్ అలవెన్స్ (DA), హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), మెడికల్ ఇన్సూరెన్స్, పింఛన్ వంటి ఇతర లాభాలు బ్యాంక్ నిబంధనల ప్రకారం లభిస్తాయి.

దరఖాస్తు విధానం : 

PNB LBO Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://pnb.bank.in ని సందర్శించాలి. 
  • కెరీర్ పేజీతో PNB LBO Recruitment 2025 పై క్లిక్ చేయాలి. 
  • న్యూ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి. 
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 3 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 23 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : CSIR–NIO Recruitment 2025 | NIOలో బంపర్ నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News