Punjab & Sind Bank Recruitment 2025 : పంజాబ్ మరియు సింధ్ బ్యాంక్ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడులైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్ట్ ప్రాతిపదికన MSME రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు MSME కస్టమర్లతో సంబంధాలు నిర్వహించడం, కొత్త వ్యాపార అవకాశాలు గుర్తించడం, లోన్ ప్రపోజల్స్, క్రెడిట్ అనాలిసిస్ వంటి పనులకు సంబంధించాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
పంజాబ్ మరియు సింధ్ బ్యాంకు నుంచి MSME రిలేషన్ షిప్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో పనిచేయాలని ఉద్దేశం ఉన్నవారు, MSME, బిజినెస్ లోన్, క్రెడిట్ అసెస్మెంట్లో అనుభవం ఉన్నవారు, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ చేయగలవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పోస్టు పేరు : MSME రిలేషన్ షిప్ మేనేజర్
- పోస్టుల సంఖ్య : 30
Also Read : PNB LBO Recruitment 2025 | పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో భారీ నోటిఫికేషన్ – 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు
అర్హతలు:
Punjab & Sind Bank Recruitment 2025 అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ(మార్కెటింగ్/ఫైనాన్స్) ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
వయోపరిమితి :
Punjab & Sind Bank Recruitment 2025 అభ్యర్థులకు 01.11.2025 నాటికి 25 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
Punjab & Sind Bank Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS : రూ.850/- + పన్నులు + గేట్‌వే ఛార్జీలు
- SC/ST/PwBD : రూ.100/- + పన్నులు + గేట్‌వే ఛార్జీలు
ఎంపిక ప్రక్రియ :
Punjab & Sind Bank Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- రాత పరీక్ష
- స్క్రీనింగ్ టెస్ట్
- పర్సనల్ ఇంటర్వ్యూ
Also Read : NABARD Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ ఆఫీసర్ పోస్టులు
జీతం వివరాలు:
Punjab & Sind Bank Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు జీతం ఇంటర్వ్యూలో నెగోషియేషన్ ఆధారంగా నిర్ణయించబడుతుంది. మొదటి కాంట్రాక్ట్ కాలం 3 సంవత్సరాలు, పనితీరు ఆధారంగా 5 సంవత్సరాల వరకు పొడిగింపు అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం :
Punjab & Sind Bank Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌కు https://punjabandsind.bank.in వెళ్లండి. రిక్రూట్మెంట్ సెక్షన్ లో నోటిఫికేషన్ ని ఓపెన్ చేయండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి అవసరమైన సర్టిఫికేట్లు అప్లోడ్ చేయండి. ఆన్ లైన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభ తేేదీ : 05 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 26 నవంబర్, 2025
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : APEDA Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో బంపర్ జాబ్స్






