RBI Summer Internship 2026 | రిజర్వ్ బ్యాంక్‌లో సమ్మర్ ఇంటర్న్ షిప్ – నెలకు రూ.20 వేల స్టైఫండ్!

On: October 31, 2025
RBI Summer Internship 2026

RBI Summer Internship 2026 : దేశంలోని ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తన Summer Internship 2026 కోసం అధికారికంగా దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులు సెంట్రల్ బ్యాంకింగ్ రంగంలో ప్రత్యక్ష అనుభవాన్ని పొందవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ 15 అక్టోబర్ 2025 నుండి ప్రారంభమై, 15 డిసెంబర్ 2025 వరకు కొనసాగుతుంది. ఇది బ్యాంకింగ్, ఎకానమిక్స్, లా, కామర్స్ వంటి విభాగాల్లో ఉన్న ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక విలువైన అవకాశంగా చెప్పవచ్చు.

 ఇంటర్న్‌షిప్ వివరాలు

  • సంస్థ: Reserve Bank of India (RBI)
  • ప్రోగ్రామ్: Summer Placement / Internship 2026
  • దరఖాస్తు ప్రారంభం: 15 అక్టోబర్ 2025
  • చివరి తేదీ: 15 డిసెంబర్ 2025
  • ఇంటర్న్‌షిప్ ప్రారంభం: ఏప్రిల్ 2026
  • ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా

Also Read : RRC NER Sports Quota Recruitment 2025 |  రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

అర్హతలు (Eligibility Criteria)

RBI Summer Internship 2026 ఇంటర్న్‌షిప్‌కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కింది అర్హతలు కలిగి ఉండాలి.

  • భారతదేశంలోని గుర్తింపు పొందిన కళాశాలలలో చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • పోస్ట్‌గ్రాడ్యుయేట్ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సులు (Management, Statistics, Law, Commerce, Economics, Banking, Finance) చేస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • లా విభాగంలో 3 సంవత్సరాల ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నవారు కూడా అర్హులు.
  • తమ కోర్సు చివరి-but-one సంవత్సరం (penultimate year) లో ఉన్న విద్యార్థులే దరఖాస్తు చేసుకోవాలి.

వయోపరిమితి

RBI Summer Internship 2026 ఈ ఇంటర్న్‌షిప్‌కు RBI ప్రత్యేక వయోపరిమితి ఇవ్వలేదు. అయితే విద్యార్థులు తమ కోర్సు చివరి-but-one సంవత్సరంలో ఉండాలి.

స్టైపెండ్ & ఇతర సౌకర్యాలు

  • స్టైపెండ్: ₹20,000/-
  • ప్రయాణ ఖర్చులు: Outstation అభ్యర్థులకు AC II Tier రైల్వే ప్రయాణ ఖర్చులు రీయింబర్స్ అవుతాయి.
  • గమనిక: నివాస సౌకర్యం అభ్యర్థులే తమ ఖర్చుతో ఏర్పాటు చేసుకోవాలి.

ఎంపిక విధానం

  • దరఖాస్తులు పరిశీలించిన తర్వాత shortlisted అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఫైనల్ సెలెక్షన్ ఫలితాలు ఫిబ్రవరి / మార్చి 2026లో ప్రకటిస్తారు.

దరఖాస్తు విధానం (How to Apply Online)

  1. RBI అధికారిక వెబ్‌సైట్‌  www.rbi.org.in లోకి వెళ్లాలి.
  2. “Opportunities @ RBI” లేదా “Summer Placement” విభాగం క్లిక్ చేయండి.
  3. “RBI Summer Internship 2026” అనే ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  4. Bio-Data, విద్యా వివరాలు, మరియు సంస్థ వివరాలను జాగ్రత్తగా నింపండి.
  5. అవసరమైన డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి:
    • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
    • సంతకం
    • బోనాఫైడ్ సర్టిఫికేట్ (మీ కళాశాల నుండి)
  6. అన్ని వివరాలు సరిచూసుకుని Submit చేయండి.
  7. దరఖాస్తు సమర్పించిన తర్వాత ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.

Note:

  • ఒక్క రాష్ట్రానికి సంబంధించిన Control Officeకి మాత్రమే దరఖాస్తు చేయాలి.
  • Incomplete applications (ఫోటో, సంతకం, బోనాఫైడ్ సర్టిఫికేట్ లేకపోతే) రద్దు అవుతాయి.
  • CGPA / SGPA ని శాతంగా మార్చి దరఖాస్తులో పేర్కొనాలి.
  • చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేయడం మంచిది.

ముఖ్యమైన తేదీలు:

ఈవెంట్తేదీ
దరఖాస్తు ప్రారంభం15 అక్టోబర్ 2025
చివరి తేదీ15 డిసెంబర్ 2025
ఇంటర్వ్యూజనవరి / ఫిబ్రవరి 2026
ఫలితాలుఫిబ్రవరి / మార్చి 2026
NotificationClick here
Apply LinkClick here

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు

Leave a Comment

Follow Google News