RGNAU Professional Trainee Recruitment 2025 | నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీలో ప్రొఫెషనల్ ట్రైనీ జాబ్స్

On: October 31, 2025
RGNAU Professional Trainee Recruitment 2025

RGNAU Professional Trainee Recruitment 2025 : భారతదేశంలో విమానయాన రంగానికి సంబంధించిన అత్యున్నత విద్యాసంస్థలలో ఒకటైన రాజీవ్ గాంధీ నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ (RGNAU) నుంచి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఫైనాన్స్ మరియు అకౌంట్స్ విభాగంలో ప్రొఫెషనల్ ట్రైనీ (Professional Trainee) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈమెయిల్ ద్వాారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

RGNAU Professional Trainee Recruitment 2025
RGNAU Professional Trainee Recruitment 2025

 ఖాళీల వివరాలు:

  • పోస్ట్ పేరు: ప్రొఫెషనల్ ట్రైనీ (Professional Trainee)
  • విభాగం: ఫైనాన్స్ & అకౌంట్స్
  • మొత్తం ఖాళీలు: 2

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు

అర్హతలు :

RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి. 

  • అభ్యర్థులు ఏదైనా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
  • అలాగే CA / CMA (ICWA) కోర్సులో ఇంటర్మీడియట్ లెవల్ (Semi-qualified) పూర్తి చేసి ఉండాలి.
  • కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

 వయోపరిమితి:

RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులకు దరఖాస్తు చివరి తేదీ నాటికి 30 సంవత్సరాల మధ్య వయస్స ఉండాలి. 

స్టైపెండ్ :

RGNAU Professional Trainee Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 

  • మొదటి సంవత్సరం: ₹20,000/- ప్రతినెల
  • రెండో సంవత్సరం : ₹22,000/- ప్రతినెల
  • హాస్టల్ లేదా షేర్డ్ అకామడేషన్ (₹500/- నెలకు) చెల్లించి పొందవచ్చు.
  • మెడికల్ ఫెసిలిటీ: యూనివర్సిటీ విద్యార్థుల మాదిరిగా OPD వైద్య సదుపాయం ఉంటుంది.

 శిక్షణ కాలం :

  • మొదట 1 సంవత్సరం కాలానికి నియామకం ఉంటుంది.
  • అవసరమైతే మరో 1 సంవత్సరం వరకు పొడిగించవచ్చు. (గరిష్టం 2 సంవత్సరాలు)
  • ప్రతి పూర్తి చేసిన నెలకు 1 రోజు సెలవు లభిస్తుంది.

Also Read : NHAI Recruitment 2025 | నేషనల్ హైవేస్ లో బంపర్ జాబ్స్

ఎంపిక విధానం :

RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

  • దరఖాస్తు స్క్రీనింగ్ : సమర్పించిన అప్లికేషన్లు మరియు డాక్యుమెంట్స్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. 
  • ఇంటర్వ్యూ : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూకు పిలుస్తారు.  వివరాలు ఈమెయిల్ ద్వారా పంపిస్తారు.
  • తుది ఎంపిక ఇంటర్వ్యూలో పనితీరు ఆధారంగా జరుగుతుంది. 

 దరఖాస్తు విధానం:

RGNAU Professional Trainee Recruitment 2025 అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాలి. 

  1. అభ్యర్థులు RGNAU అధికారిక వెబ్‌సైట్ www.rgnau.ac.in లోకి వెళ్లాలి.
  2. అప్లికేషన్ ఫారమ్ డౌన్ లోడ్ చేసుకోవాలి.
  3. అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  4. అవసరమైన డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అటాచ్ చేయాలి. 
  5. అప్లికేషన్  ఫారమ్ మరియు అవసరమైన సర్టిఫికేట్లతో కలిపి ఒకే PDF ఫైల్‌గా స్కాన్ చేయాలి.
  6. ఆ PDF ఫైల్‌ను ఈమెయిల్ ద్వారా పంపాలి: pt.recruit@rgnau.ac.in
  7. హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు.
  8. ఇంటర్వ్యూకి పిలుపు వచ్చినప్పుడు అసలు సర్టిఫికేట్లు చూపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 30 నవంబర్ 2025

NotificationClick here
Official WebsiteClick here

Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

Leave a Comment

Follow Google News