RITES Recruitment 2025 : ఇంజినీరింగ్ ఫీల్డ్‌లో ప్రభుత్వ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే అభ్యర్థులకు శుభవార్త. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసే ఒక నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ RITES Limited నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మొత్తం 600 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 12వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు :
పోస్టులు రీజన్ వారీగా ఉన్నాయి. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ ప్రాంతాల్లో Civil, Electrical, Mechanical, Chemical, Metallurgy, S&T, Chemistry వంటి విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
- పోస్టు పేరు : సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
- మొత్తం పోస్టుల సంఖ్య : 600
- పోస్టింగ్ ప్రాంతాలు : దేశవ్యాప్తంగా ఉన్న రీజన్లలో నియామకం ఉంటుంది.
Also Read : RBI Summer Internship 2026 | రిజర్వ్ బ్యాంక్‌లో సమ్మర్ ఇంటర్న్ షిప్ – నెలకు రూ.20 వేల స్టైఫండ్!
అర్హతలు :
RITES Recruitment 2025 అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
- అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- కనీసం 2 సంవత్సరాల అనుభవం సంబంధిత ఫీల్డ్‌లో ఉండాలి.
వయపరిమితి :
RITES Recruitment 2025 అభ్యర్థులకు 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/OBC/PwD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసండలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
RITES Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- General/OBC: ₹300 + టాక్స్‌లు
- EWS/SC/ST/PwD: ₹100 + టాక్స్‌లు
- SC/ST/PwD అభ్యర్థులకు రాత పరీక్షలో హాజరైతే ఫీజు రీఫండ్ ఇస్తారు.
ఎంపిక ప్రక్రియ :
RITES Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- 1వ దశ: రాత పరీక్ష (125 ప్రశ్నలు – 2.5 గంటలు, నెగటివ్ మార్కింగ్ లేదు)
- 2వ దశ: డాక్యుమెంట్ వెరిఫికేషన్
- పరీక్షలో కనీసం UR/EWS కోసం 50%, SC/ST/OBC/PwD కోసం 45% మార్కులు రావాలి.
Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు
జీతం వివరాలు :
RITES Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.29,735/- జీతం ఇస్తరు.
దరఖాస్తు విధానం :
RITES Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు ముందుగా www.rites.com వెబ్‌సైట్‌లోని వెళ్లాలి. Careers Section లోకి వెళ్లి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. అవసరమైన పత్రాలు (సర్టిఫికేట్‌లు, మార్క్స్ మెమోలు, ఐడీ ప్రూఫ్ మొదలైనవి) అప్‌లోడ్ చేయాలి. ఫీజు చెల్లించిన తర్వాత ఫైనల్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని భద్రపరచుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ : 12 నవంబర్, 2025
- రాత పరీక్ష తేదీ : 23 నవంబర్, 2025
పరీక్ష కేంద్రాలు :
- పరీక్షలు Delhi, Mumbai, Hyderabad, Chennai, Kolkata, Bengaluru, Ahmedabad, Lucknow వంటి ప్రధాన నగరాల్లో జరుగుతాయి.
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RGNAU Professional Trainee Recruitment 2025 | నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీలో ప్రొఫెషనల్ ట్రైనీ జాబ్స్






