RRC NER Sports Quota Recruitment 2025 |  రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్

On: October 31, 2025
RRC NER Sports Quota Recruitment 2025

RRC NER Sports Quota Recruitment 2025 : భారతీయ రైల్వేలో ఉద్యోగం కావాలనుకునే క్రీడాకారులకు గుడ్ న్యూస్. నార్త్ ఈస్టర్న్ రైల్వే (North Eastern Railway – NER) గోరఖ్‌పూర్ స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ పోస్టులను భర్తీ చేస్తున్నారు. వివిధ క్రీడల్లో మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. 10వ తరగతి నుంచి గ్రాడ్యుయేట్ వరకు అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 10 నవంబర్ 2025 సాయంత్రం 6 గంటలలోపు సమర్పించాలి.

RRC NER Sports Quota Recruitment 2025
RRC NER Sports Quota Recruitment 2025

ఖాళీల వివరాలు

మొత్తం 49 పోస్టులు ఉన్నాయి — వీటిలో గ్రూప్ ‘C’ మరియు గ్రూప్ ‘D’ (Level 1) స్థాయిలలో ఉద్యోగాలు ఉన్నాయి.

క్రీడా విభాగాలు:

  • అథ్లెటిక్స్ (పురుషులు/మహిళలు)
  • రెజ్లింగ్
  • హ్యాండ్‌బాల్
  • కబడ్డీ
  • క్రికెట్
  • వాలీబాల్
  • హాకీ
  • ఫుట్‌బాల్
  • వెయిట్‌లిఫ్టింగ్
  • స్విమ్మింగ్ / డైవింగ్
  • బాస్కెట్‌బాల్
  • బాక్సింగ్

మొత్తం పోస్టులు: 49

  • లెవల్ 4/5 (Grade Pay ₹2400–₹2800): 05
  • లెవల్ 2/3 (Grade Pay ₹1900–₹2000): 16
  • లెవల్ 1 (Grade Pay ₹1800): 28

Also Read : RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు

విద్యార్హతలు

RRC NER Sports Quota Recruitment 2025 పోస్టు లెవల్ ని బట్టి విద్యార్హతలు కింది విధంగా ఉంటాయి. 

  • Level 1 : 10వ తరగతి లేదా ITI లేదా National Apprenticeship Certificate (NCVT).
  • Level 2/3 : 10+2 లేదా దానికి సమానమైన అర్హత, లేదా ITI / Apprenticeship.
  • Level 4/5 : ఏదైనా డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత.

 క్రీడా అర్హతలు

అభ్యర్థులు గత రెండు సంవత్సరాల్లో (01.04.2023 తరువాత) గుర్తింపు పొందిన క్రీడా పోటీల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి.

  • Category-A, B, C స్థాయిలో ప్రతిభ చూపిన వారు అర్హులు.
  • ప్రతి క్రీడకు ప్రత్యేక ప్రమాణాలు ఉన్నాయి (ఉదా: నేషనల్ గేమ్స్, ఇంటర్ యూనివర్సిటీ, ఫెడరేషన్ కప్ మొదలైనవి).

వయోపరిమితి

RRC NER Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.

  • 02/01/2001 నుండి 01/01/2008 మధ్యలో జన్మించిన వారు మాత్రమే అర్హులు.
  • వయోపరిమితిలో ఎలాంటి సడలింపు లేదు.

 జీతం వివరాలు (7వ CPC ప్రకారం)

RRC NER Sports Quota Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పోస్టు లెవల్ ని బట్టి ఆకర్షణీయమైన జీతం ఇవ్వం జరుగుతుంది. 

  • Level 1: ₹18,000 – ₹56,900/-
  • Level 2/3: ₹19,900 – ₹63,200/-
  • Level 4/5: ₹25,500 – ₹92,300/-

అప్లికేషన్ ఫీజు

RRC NER Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • SC/ST/Women/Minority/PwBD/Ex-Servicemen: ₹250 (ట్రయల్‌లో హాజరైతే ₹250 రీఫండ్)
  • ఇతర అభ్యర్థులు: ₹500 (ట్రయల్‌లో హాజరైతే ₹400 రీఫండ్)

Also Read : NHAI Recruitment 2025 | నేషనల్ హైవేస్ లో బంపర్ జాబ్స్

 ఎంపిక విధానం

RRC NER Sports Quota Recruitment 2025  ఎంపిక పూర్తిగా ట్రయల్ మరియు క్రీడా ప్రతిభా మూల్యాంకనం ఆధారంగా జరుగుతుంది.

  • ట్రయల్ మార్కులు: 40 మార్కులు
  • స్పోర్ట్స్ అచీవ్‌మెంట్: 50 మార్కులు
  • ఎడ్యుకేషన్: 10 మార్కులు
    మొత్తం: 100 మార్కులు

 దరఖాస్తు విధానం:

RRC NER Sports Quota Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  1. అధికారిక వెబ్‌సైట్‌ www.ner.indianrailways.gov.in లోకి వెళ్లాలి. 
  2. “Sports Quota Recruitment 2025-26” లింక్‌ పై క్లిక్ చేయండి.
  3. ఆన్‌లైన్ ఫారమ్‌లో అన్ని వివరాలు సరిగ్గా నింపండి.
  4. పాస్‌పోర్ట్ ఫోటో, సిగ్నేచర్ మరియు సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి.
  5. ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించండి.
  6. దరఖాస్తు ఫారమ్‌ ప్రింట్‌ తీసుకొని భద్రపరచుకోండి.

దరకాస్తులకు చివరి తేదీ: 10 నవంబర్ 2025 (సాయంత్రం 6 గంటలలోపు)

NotificationClick here
Apply OnlineClick here

Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

Leave a Comment

Follow Google News