Rubber Board Recruitment 2025 : భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమ మంత్రిత్వశాఖకు చెందిన రబ్బర్ బోర్డ్ (Rubber Board), కొట్టాయం – కేరళ లో వివిధ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, మరియు ఇతర టెక్నికల్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 1వ తేదీ లోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 51
- Scientist A – 5 పోస్టులు
- Scientist B – 19 పోస్టులు
- Scientist C – 5 పోస్టులు
- Assistant Director (Systems) – 1 పోస్టు
- Mechanical Engineer – 1 పోస్టు
- Statistical Inspector – 2 పోస్టులు
- Electrician – 3 పోస్టులు
- Scientific Assistant – 10 పోస్టులు
- Hindi Typist – 1 పోస్టు
- Junior Technical Officer (House Keeping) – 1 పోస్టు
- Junior Technical Officer (AC & Refrigeration) – 1 పోస్టు
- Systems Assistant (Hardware & Networking) – 1 పోస్టు
- Vigilance Officer (Deputation) – 1 పోస్టు
Also Read : APEDA Recruitment 2025: కేంద్ర ప్రభుత్వ సంస్థలో బంపర్ జాబ్స్
అర్హతలు మరియు వయోపరిమితి:
Rubber Board Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టు ఆధారంగా విద్యార్హతలు మరియు వయోపరిమితి మారుతాయి.
Scientist A:
- BE/B.Tech లేదా మాస్టర్స్ డిగ్రీ (Remote Sensing, Bioinformatics, Agronomy, Botany మొదలైన సబ్జెక్ట్స్‌లో).
- NET/GATE ఉత్తీర్ణత లేదా 2 సంవత్సరాల పరిశోధన అనుభవం ఉండాలి.
- వయస్సు: 35 సంవత్సరాలు.
Scientist B:
- Bachelor’s & Master’s Degree (Agriculture, Botany, Biotech, Economics, Chemistry మొదలైన సబ్జెక్ట్స్‌లో).
- 3 సంవత్సరాల రీసెర్చ్ అనుభవం అవసరం.
- వయస్సు: 40 సంవత్సరాలు.
Scientist C:
- Bachelor’s & Master’s Degree (Agriculture, Biotechnology, Plant Physiology మొదలైన సబ్జెక్ట్స్‌లో).
- కనీసం 5 సంవత్సరాల రీసెర్చ్ అనుభవం ఉండాలి.
- వయస్సు: 50 సంవత్సరాలు.
Assistant Director (Systems):
- BE/B.Tech (Computer Science/IT) లేదా MCA.
- 3 సంవత్సరాల సిస్టమ్ డెవలప్‌మెంట్ లేదా నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ అనుభవం.
- వయస్సు: 40 సంవత్సరాలు.
Mechanical Engineer:
- BE/B.Tech (Mechanical Engineering).
- 6 సంవత్సరాల అనుభవం హెవీ మెషినరీ మెయింటెనెన్స్‌లో ఉండాలి.
- వయస్సు: 40 సంవత్సరాలు.
Statistical Inspector:
- మాస్టర్స్ డిగ్రీ (Statistics / Maths / Econometrics).
- 2 సంవత్సరాల డేటా అనలిసిస్ అనుభవం.
- వయస్సు: 27 సంవత్సరాలు.
Electrician:
- SSLC + ITI (Electrician Trade) + 2 సంవత్సరాల అనుభవం.
- వయస్సు: 30 సంవత్సరాలు.
Scientific Assistant:
- B.Sc (Botany/Chemistry/Zoology).
- 2 సంవత్సరాల ల్యాబ్ అనుభవం ప్రాధాన్యత.
- వయస్సు: 30 సంవత్సరాలు.
Hindi Typist:
- 12వ తరగతి ఉత్తీర్ణత, హిందీ టైపింగ్ స్పీడ్ 25 wpm.
- వయస్సు: 27 సంవత్సరాలు.
Junior Technical Officer (House Keeping / AC & Refrigeration):
- డిప్లొమా లేదా ITI సంబంధిత ట్రేడ్‌లో + అనుభవం అవసరం.
- వయస్సు: 30 సంవత్సరాలు.
Systems Assistant:
- కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లో డిగ్రీ / డిప్లొమా + 2 సంవత్సరాల అనుభవం.
- వయస్సు: 30 సంవత్సరాలు.
Vigilance Officer (Deputation):
- డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేదా సమాన ర్యాంక్ అధికారులకు అర్హత.
- వయస్సు: 50 సంవత్సరాలు.
వయోసడలింపు :
- SC/ST – 5 సంవత్సరాలు
- OBC – 3 సంవత్సరాలు
- PwBD – 10 సంవత్సరాలు
- రబ్బర్ బోర్డ్ ఉద్యోగులకు ప్రత్యేక సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
Rubber Board Recruitment 2025 పోస్టును బట్టి పేస్కేల్ మారుతుంది.
- Scientist A: Level-7 (₹44,900 – ₹1,42,400)
- Scientist B / Mechanical Engineer / Assistant Director: Level-10 (₹56,100 – ₹1,77,500)
- Scientist C / Vigilance Officer: Level-11 (₹67,700 – ₹2,08,700)
- Scientific Assistant: Level-5 (₹29,200 – ₹92,300)
- Electrician / Hindi Typist: Level-2 (₹19,900 – ₹63,200)
- Statistical Inspector: Level-6 (₹35,400 – ₹1,12,400)
- Junior Technical Officers: Level-4/5 (₹25,500 – ₹92,300)
Also Read : CSIR–NIO Recruitment 2025 | NIOలో బంపర్ నోటిఫికేషన్
అప్లికేషన్ ఫీజు:
Rubber Board Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
Group A పోస్టులు: ₹1500/-
- Group B పోస్టులు: ₹1000/-
- Group C పోస్టులు: ₹500/-
- SC/ST/PwBD/Women: ఫీజు లేదు
ఎంపిక ప్రక్రియ:
Rubber Board Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. ప్రతి పోస్టుకు పరీక్ష విధానం వేర్వేరుగా ఉంటుంది. అర్హత పొందిన అభ్యర్థుల వివరాలు రిక్రూట్‌మెంట్ పోర్టల్‌లో ప్రకటిస్తారు.
దరఖాస్తు విధానం:
Rubber Board Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ https://recruitments.rubberboard.org.in లోకి వెళ్లాలి.
- రిక్రూట్మెంట్ విభాగంలో నోటిఫికేషన్ పై క్లిక్ చేయాలి.
- ఆన్ లైన్ రిక్రూట్మెంట్ అప్లికేషన్ పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి.
- అవసరమైన సర్టిఫికేట్లు స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.
- ప్రతి పోస్టుకు వేర్వేరుగా అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: 01.12.2025 (రాత్రి 11:59 వరకు)
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : RRC SCR Sports Quota Recruitment 2025 | సౌత్ సెంట్రల్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో జాబ్స్






