SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

On: October 30, 2025
SEBI Grade A Recruitment 2025

SEBI Grade A Recruitment 2025 : భారత ప్రభుత్వ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా Officer Grade A (Assistant Manager) పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 110 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 30వ తేదీ నుంచి నవంబర్ 28వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనాన్స్, లా, IT, రీసెర్చ్, ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో ఉన్నత అర్హతలతో ఉన్న అభ్యర్థులకు ఇది అద్భుత అవకాశం.

SEBI Grade A Recruitment 2025
SEBI Grade A Recruitment 2025

ఖాళీల వివరాలు : 

SEBI Grade A Recruitment 2025 లో 7 వేర్వేరు విభాగాల్లో మొత్తం 110 ఖాళీలు ఉన్నాయి. కేటగిరీల వారీగా మరియు స్ట్రీమ్ వారీగా ఖాళీల వివరాలు ఇప్పుడు చూద్దాం. 

పోస్టు స్ట్రీమ్మొత్తం ఖాళీలు 
జనరల్56 
లీగల్20 
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ22 
రీసెర్చ్
అధికారిక భాష
ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్)
ఇంజనీరింగ్ (సివిల్)
మొత్తం110

Also Read : ISRO SDSC SHAR Notification 2025 | శ్రీహరికోటలో బంపర్ నోటిఫికేషన్

అర్హతలు : 

SEBI Grade A Recruitment 2025 పోస్టు స్ట్రీమ్ ని బట్టి అభ్యర్థుల విద్యార్హతలు మారుతాయి. 

పోస్టు స్ట్రీమ్విద్యార్హతలు
జనరల్ స్ట్రీమ్ మాస్టర్స్ డిగ్రీ / పీజీ డిప్లొమా / CA / CFA / CS / CMA
లీగల్లాలో బ్యాచిలర్ డిగ్రీ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకంప్యూటర్ సైన్స్ లో బీఈ / బీటెక్ లేదాా పీజీ
రీసెర్చ్ఎకనామిక్స్ / స్టాటిస్టిక్స్ / ఫైనాన్స్ లో మాస్టర్స్
అధికారిక భాషహిందీ / ఇంగ్లీష్ తో పాటు హిందీలో మాస్టర్స్ డిగ్రీ
ఇంజనీరింగ్(ఎలక్ట్రికల్)ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్
ఇంజనీరింగ్ (సివిల్)సివిల్ ఇంజనీరింగ్ లో బీఈ / బీటెక్

వయోపరిమితి : 

SEBI Grade A Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు : 

SEBI Grade A Recruitment 2025  అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్/ OBC / EWS: ₹1,000/-
  • SC / ST / PwBD: ₹100/-

ఎంపిక ప్రక్రియ : 

SEBI Grade A Recruitment 2025 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది. 

  • ఆన్ లైన్ స్క్రీనింగ్ టెస్ట్
  • మెయిన్ ఎగ్జామ్
  • ఇంటర్వ్యూ

Also Read : NEEPCO Executive Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

జీతం వివరాలు : 

SEBI Grade A Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు ₹62,500 – ₹1,26,100/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. అన్ని అవలెన్సులు కలుపుకొని సుమారు రూ.1.30 లక్షల నుంచి రూ.1.50 లక్షల వరకు జీతం అందుతుంది.

దరఖాస్తు విధానం : 

SEBI Grade A Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

  • అధికారిక వెబ్‌సైట్ www.sebi.gov.in సందర్శించాలి.
  • Careers” సెక్షన్‌లోకి వెళ్లి “SEBI Officer Grade A Recruitment 2025” లింక్‌ ఓపెన్ చేయాలి.
  • ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ పూర్తిగా నింపి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ చెల్లించాలి.
  • చివరగా సబ్మిట్ చేసి, ప్రింట్ కాపీ సేవ్ చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 28 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్

Leave a Comment

Follow Google News