South Western Railway Sports Quota Recruitment 2025 | స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో జాబ్స్

On: October 28, 2025
South Western Railway Sports Quota Recruitment 2025

South Western Railway Sports Quota Recruitment 2025 : దక్షిణ పశ్చిమ రైల్వే (South Western Railway), హుబ్బళి నుంచి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో వివిధ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 46 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దేశంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులు రైల్వేలో ఉద్యోగాన్ని పొందే అద్భుత అవకాశం ఇది.

South Western Railway Sports Quota Recruitment 2025
South Western Railway Sports Quota Recruitment 2025

ఖాళీల వివరాలు

మొత్తం పోస్టులు: 46

  • Level 5/4 పోస్టులు – 05
  • Level 3/2 పోస్టులు – 16
  • Level 1 పోస్టులు – 25

విభాగాలు: Athletics, Basketball, Cricket, Golf, Chess, Volleyball, Weightlifting, Table Tennis, Swimming, Hockey, Bodybuilding, Ball Badminton, Water Polo మొదలైన క్రీడల్లో నియామకాలు ఉన్నాయి.

డివిజన్లు

  • హుబ్బళి డివిజన్
  • బెంగళూరు డివిజన్
  • మైసూరు డివిజన్

Also Read : NI-MSME Recruitment 2025 | NI-MSME హైదరాబాద్ లో జాబ్స్

అర్హతలు : 

South Western Railway Sports Quota Recruitment 2025 పే లెవల్ ని బట్టి అభ్యర్థుల విద్యర్హతలు మారుతాయి. 

  • Level 5/4: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
  • Level 3/2: 12వ తరగతి లేదా ITI పూర్తయి ఉండాలి.
  • Level 1: 10వ తరగతి ఉత్తీర్ణత.

వయోపరిమితి : 

South Western Railway Sports Quota Recruitment 2025 అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 02.01.2001 నుండి 01.01.2008 మధ్య ఉండాలి.

క్రీడా అర్హతలు : 

క్రీడా విజయాలు 01.04.2023 తర్వాత సాధించినవే పరిగణనలోకి తీసుకుంటారు. జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన వారు అర్హులు. Athletics, Cricket, Table Tennis, Chess, Golf వంటి విభాగాల్లో నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి.

అప్లికేషన్ ఫీజు : 

South Western Railway Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. 

  • జనరల్ అభ్యర్థులకు: ₹500 (ట్రయల్‌లో పాల్గొంటే ₹400 తిరిగి వస్తుంది)
  • SC/ST/మహిళలు/ఎకానమికల్ వీక్ క్లాస్ (EBC)/మైనారిటీలు: ₹250 (ట్రయల్‌లో పాల్గొంటే మొత్తం తిరిగి వస్తుంది)

ఎంపిక ప్రక్రియ : 

South Western Railway Sports Quota Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 

  • ట్రయల్స్ సమయంలో గేమ్ స్కిల్, ఫిజకల్ ఫిట్ నెస్ మరియు కోచ్ పరిశీలనకు 40 మార్కులు ఉంటాయి. 
  • క్రీడావిజయాలకు 50 మార్కులు ఉంటాయి. 
  • విద్యార్హతలకు 10 మార్కులు ఉంటాయి.

కనీస అర్హత మార్కులు

  • Level 5/4 – 70 మార్కులు
  • Level 3/2 – 65 మార్కులు
  • Level 1 – 60 మార్కులు

Also Read : UoH Non-Teaching Recruitment 2025 | హైదరాబాద్ యూనివర్సిటీలో నాన్ టీచింగ్ జాబ్స్

జీతం వివరాలు : 

South Western Railway Sports Quota Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు పే లెవల్ ప్రకారం జీతం ఇవ్వడం జరుగుతుంది.

  • Level-5/4: ₹29,200 – ₹92,300/-
  • Level-3/2: ₹19,900 – ₹63,200/-
  • Level-1: ₹18,000 – ₹56,900 /-

దరఖాస్తు విధానం : 

South Western Railway Sports Quota Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. 

  • అధికారిక వెబ్‌సైట్‌ www.rrchubli.in లోకి వెళ్లాలి. 
  • “Recruitment against Sports Quota (Open Advertisement)” లింక్‌పై క్లిక్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన పత్రాలు అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 21 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 20 నవంబర్, 2025
NotificationClick here
Apply OnlineClick here

Also Read : RPF Recruitment New Rules 2025: రైల్వే పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో భారీ మార్పులు

Leave a Comment

Follow Google News