AgHub Recruitment 2025 : గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ వ్యాపారాలు, స్టార్టప్‌లు, మరియు రైతు ఔత్సాహికతను ప్రోత్సహించేందుకు AgHub Foundation (Professor Jayashankar Telangana State Agricultural University – PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్) నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రూరల్ కోఆర్డినేటర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఖాళీల వివరాలు:
| పోస్టు పేరు | ప్రాంతం | ఖాళీలు |
| Rural Coordinator | జగిత్యాల | 01 |
| Rural Coordinator | టాండూర్ | 01 |
| మొత్తం ఖాళీలు: 02 |
Also Read : IAF AFCAT 01/2026 Notification | ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నోటిఫికేషన్
అర్హతలు:
AgHub Recruitment 2025 అభ్యర్థులు B.Sc Agriculture లేదా సంబంధించిన Agriculture Allied Sciencesలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు గ్రామీణ వ్యాపారాలు / గ్రామీణ స్టార్టప్ అభివృద్ధిలో ఆసక్తి, స్టార్టప్ ఎకోసిస్టం, గ్రామీణ వ్యాపారులతో పనిచేయగల సామర్థ్యం, Computer & Office Management లో బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. Development / NGO / Incubator లో మునుపటి అనుభవం ఉంటే ప్రాధాన్యం ఇస్తారు.
వయోపరిమితి :
AgHub Recruitment 2025 అభ్యర్థులకు 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి.
అప్లికేషన్ ఫీజు :
AgHub Recruitment 2025 అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఎంపిక ప్రక్రియ:
AgHub Recruitment 2025 అభ్యర్థులకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు. వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
Also Read : CCRH Recruitment 2025 | ఆయూష్ మంత్రిత్వ శాఖలో గ్రూప్ A, B & C పోస్టులు
జీతం వివరాలు :
AgHub Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
పని విధులు :
- గ్రామీణ ప్రాంతాల్లో స్టార్టప్ & వ్యాపార శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం.
- రైతు-ఔత్సాహికులను గుర్తించి, మార్గదర్శకత్వం కల్పించడం.
- రోజువారీ కార్యకలాపాలు & ఫైల్ రికార్డులు నిర్వహించడం.
- మెంటర్లు, నిపుణులు, బిజినెస్ టీమ్‌లతో సమన్వయం చేయడం.
- ఈవెంట్లు, వర్క్‌షాప్‌లు, శిక్షణ క్యాంపులు నిర్వహించడం
దరఖాస్తు విధానం :
AgHub Recruitment 2025 అభ్యర్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీలు :
- 21 నవంబర్, 2025 మధ్యాహ్నం 2.30 గంటలకు
- వేదిక : AgHub, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
అవసరమైన పత్రాలు :
- తాజా రెజ్యూమే
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
- అసలు ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్లు మరియు ఫోటోకాపీలు
Notification : Click here
Official Website : Click here
Also read : CSIR–NIO Recruitment 2025 | NIOలో బంపర్ నోటిఫికేషన్






