Bank of Baroda Apprenticeship Recruitment 2025 | బ్యాంక్ బరోడాలో 2,700 ఖాళీలు – డిగ్రీ ఉంటే చాలు! వెంటనే అప్లై చేయండి

On: November 11, 2025
Bank of Baroda Apprenticeship Recruitment 2025

Bank of Baroda Apprenticeship Recruitment 2025 : Bank of Baroda దేశవ్యాప్తంగా Apprentice పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు Banking & Finance field లో అనుభవం సంపాదించడానికి మంచి అవకాశం. ఎంపికైన అభ్యర్థులు ఒక సంవత్సరం కాలం పాటు బ్యాంక్ బ్రాంచ్‌లలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పొందుతారు. మొత్తం 2700 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే చేయాలి. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 11.11.2025 నుండి ప్రారంభమై 01.12.2025 వరకు కొనసాగుతుంది. 

Bank of Baroda Apprenticeship Recruitment 2025

ఖాళీల వివరాలు

ఈ నియామకంలో రాష్ట్రాల వారీగా మొత్తం 2,700 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. మొత్తం రాష్ట్రాల వారీ సీట్ల టేబుల్ నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల వారు అయితే తెలుగు / Urdu రావాలి. 

  • ఆంధ్రప్రదేశ్ – 38 ఖాళీలు
  • తెలంగాణ – 154 ఖాళీలు
  • కర్ణాటక – 440 ఖాళీలు
  • ఉత్తర ప్రదేశ్ – 307 ఖాళీలు
  • గుజరాత్ – 400 సీట్లు

Also Read : South Indian Bank PO (CMA) Recruitment 2025 | సౌత్ ఇండియన్ బ్యాంక్ లో కొత్త నోటిఫికేషన్

అర్హతలు

Bank of Baroda Apprenticeship Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థి తాను అప్లై చేసిన రాష్ట్ర భాష చదవడం, రాయడం, మాట్లాడడం రావాలి. 

వయోపరిమితి

  • కనీస వయస్సు: 20 సంవత్సరాలు
  • గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు (01.11.2025 నాటికి)

వయస్సు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం

  • OBC: +3 సంవత్సరాలు
  • SC/ST: +5 సంవత్సరాలు
  • PwBD: అదనంగా సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఫీజు

ఫీజు ఆన్‌లైన్‌ లో మాత్రమే చెల్లించాలి.

కేటగిరీఫీజు
SC / STరుసుము లేదు
PwBD₹400 + GST
General / OBC / EWS₹800 + GST

ఎంపిక ప్రక్రియ

ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది:

  1. Online Exam (100 Marks)
  2. Document Verification
  3. Local Language Test

Online Exam Pattern

విభాగంప్రశ్నలుమార్కులు
General/Financial Awareness2525
Reasoning & Quant2525
Computer Knowledge2525
General English2525
మొత్తం: 100 ప్రశ్నలు – 100 మార్కులు – 60 నిమిషాలు

Also Read : ECGC PO Recruitment 2025 | నెలకు ₹1.80 లక్షల జీతం..! డిగ్రీ ఉంటే చాలు!

జీతం / స్టైపెండ్ వివరాలు

ఎంపికైన Apprentices కి నెలకు ₹15,000/- స్టైపెండ్ ఇవ్వడం జరుగుతుంది.  ఇతర అలవెన్సులు ఇవ్వబడవు. ఇది ట్రైనీ స్థాయి పోస్టు మాత్రమే. ట్రైనింగ్ పూర్తిచేసిన తర్వాత రెగ్యులర్ జాబ్ హామీ లేదు. 

దరఖాస్తు విధానం

Bank of Baroda Apprenticeship Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

  • ముందుగా అభ్యర్థులు NATS / NAPS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 
  • Bank of Baroda Careers పేజీకి వెళ్లండి  https://bankofbaroda.bank.in
  • Current Opportunities సెక్షన్ లో Apprentice Advertisement క్లిక్ చేయండి
  • NATS Registered అయితే NATS Portal లో Bank of Baroda opportunity కి Apply చేయండి లేదా NAPS Registered అయితే → NAPS Portal లో Bank of Baroda ని సర్చ్ చేసి Apply for this Opportunity క్లిక్ చేయండి
  • Portal లో apply చేసిన తర్వాత మీకు info@bfsissc.com నుండి ఒక ఇమెయిల్ వస్తుంది. అందులో Final Application cum Exam Form లింక్ ఉంటుంది.
  • ఆ ఫారమ్ లో వివరాలు నమోదు చేయాలి. 
  • చివరగా అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్‌లో చెల్లించాలి. Fee చెల్లించిన తర్వాత మాత్రమే అప్లికేషన్ పూర్తయినట్టు పరిగణిస్తారు.

ముఖ్యమైన తేదీలు: 

  • ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం : 11 నవంబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 01 డిసెబర్, 2025

Notification : Click here

Apply Online : Click here

NATS రిజిస్ట్రేషన్: https://nats.education.gov.in

NAPS రిజిస్ట్రేషన్: https://www.apprenticeshipindia.gov.in

Bank of Baroda Careers: https://bankofbaroda.bank.in

Also Read : NABARD Assistant Manager Grade A Recruitment 2025 | నాబార్డ్ లో గ్రేడ్ ‘ఎ’ పోస్టులు – ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ప్రారంభం

Leave a Comment

Follow Google News