BSNL Recruitment 2025 | BSNLలో 120 పోస్టులకు నోటిఫికేషన్

On: October 28, 2025
BSNL Recruitment 2025

BSNL Recruitment 2025 : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. టెలికాం మరియు ఫైనాన్స్ స్ట్రీమ్స్ లలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 120 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నారు. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాలేద. తేదీలో త్వరలో ప్రకటిస్తారు. ఉద్యోగాల కోసం ప్రీపేర్ అయ్యే వారు ప్రిపరేషన్ ఇప్పటి నుంచే ప్రారంభించండి. 

BSNL Recruitment 2025
BSNL Recruitment 2025

ఖాళీల వివరాలు : 

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) టెలికాం మరియు ఫైనాన్స్ విభాగాల్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పోస్టుల పేరుఖాళీల సంఖ్య
టెలికాం95
ఫైనాన్స్25
మొత్తం120

Also Read : National Sanskrit University Tirupati Recruitment 2025 | తిరుపతిలోని సంస్కృత యూనివర్సిటీ జాబ్స్

అర్హతలు : 

BSNL Recruitment 2025 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు పోస్టు స్ట్రీమ్ ని బట్టి విద్యార్హతలు మారుతాయి. 

  • టెలికాం : సంబంధిత విభాగాల్లో కనీసం 60% మార్కులతో BE / B.Tech ఉత్తీర్ణత
  • ఫైనాన్స్ : CA / CMA ఉండాలి.

వయోపరిమితి : 

BSNL Recruitment 2025 అభ్యర్థులకు 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ : 

BSNL Recruitment 2025 సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు అభ్యర్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్

Also Read : RRB NTPC (Under Graduate) Recruitment 2025 | రైల్వేలో టికెట్ క్లర్క్, రైల్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్

జీతం వివరాలు : 

BSNL Recruitment 2025 ఎంపికైన అభ్యర్థులకు E3 IDA పే స్కేల్ ప్రకారం రూ.24,900/- నుంచి రూ.50,500/- వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

దరఖాస్తు విధానం : 

BSNL Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు సమర్పించాలి. ఆన్ లైన్ అప్లయ్ పోర్టల్ త్వరలో అధికారిక వెబ్ సైట్ లో యాక్టివేట్ అవుతుంది. 

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్ లైన్ అప్లయ్ తేదీలు త్వరలో ప్రకటించడం జరుగుతుంది. 

Notification – Click here

Also Read : CSIR NBRI MTS Recruitment 2025 | ప్రభుత్వ సంస్థలో MTS జాబ్స్

Leave a Comment

Follow Google News