ECGC PO Recruitment 2025 : దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ECGC Limited సంస్థలో Probationary Officer (PO) పోస్టులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులు Executive Officer (Generalist & Specialist) కేడర్‌లో ఉంటాయి. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. ఈ ఉద్యోగం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉండటం వల్ల జీతం, అలవెన్సులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఆన్‌లైన్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు నవంబర్ 11వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగలరు.

ఖాళీల వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 30 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
మొత్తం ఖాళీల సంఖ్య: 30
- జనరలిస్ట్ : 28
- స్పెషలిస్ట్(రాజ్ భాష/హిందీ)
Also Read : “IIG Recruitment 2025 – High Salary Govt Jobs | Apply Now”
వయోపరిమితి
ECGC PO Recruitment 2025 అభ్యర్థులకు 21 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. SC/ST/OBC/PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది.
అర్హతలు
ECGC PO Recruitment 2025 ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు కింది అర్హతలు ఉండాలి.
Generalist PO కోసం
- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
Specialist (Rajbhasha/Hindi) కోసం
- హిందీ/హిందీ ట్రాన్స్‌లేషన్ లో మాస్టర్స్ మరియు డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ లేదా ఇంగ్లీష్ లో మాస్టర్స్ మరియు డిగ్రీలో హిందీ సబ్జెక్ట్
అప్లికేషన్ ఫీజు
ECGC PO Recruitment 2025 అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
| కేటగిరి | ఫీజు |
| SC / ST / PwBD | ₹175 |
| ఇతర అభ్యర్థులు | ₹950 |
ఎంపిక ప్రక్రియ
ECGC PO Recruitment 2025 ఈ ఉద్యోగానికి అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది:
- ఆన్‌లైన్ పరీక్ష
- ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
Also Read : DTU Recruitment 2025: Apply for 66 Group-C Posts – No Interview
జీతం వివరాలు
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు Basic Pay + Allowances కలిపి సుమారు ₹20,00,000/- (20 లక్షల రూపాయల వరకు) వార్షిక ప్యాకేజీ లభిస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ జాబ్ కాబట్టి అలవెన్సులు కూడా చాలా బాగా ఉంటాయి. పే స్కేల్ ₹ 88,635 – 1,69,025/- వరకు ఉంటుంది.
దరఖాస్తు విధానం
ECGC PO Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్ www.ecgc.in లోకి వెళ్లాలి.
- Careers → Recruitment of Probationary Officer లో అప్లై లింక్ పై క్లిక్ చేయాలి.
- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.
- అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి.
- చివరిగా అప్లికేషన్ ప్రింట్ కాపీ సేవ్ చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభం : 11 నవంబర్, 2025
- దరఖాస్తులకు చివరి తేదీ : 2 డిసెబర్, 2025
- ఆన్ లైన్ పరీక్ష తేదీ : 11 జనవరి, 2026
| Notification | Click here |
| Apply Online | Click here |
Also Read : “ISRO NRSC Recruitment 2025 – New Job Notification Released”






