MSTC Management Trainee Recruitment 2025 : ప్రభుత్వ రంగ సంస్థలో స్థిరమైన కెరీర్ కావాలని చూస్తున్న యువతకు MSTC Limited ప్రకటించిన ఈ నోటిఫికేషన్ నిజంగా మంచి అవకాశం. స్టీల్ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ Mini Ratna Category-I PSU, గత కొన్నేళ్లుగా ఇ-కామర్స్ సేవలు, ఇ-ఆక్షన్స్, ఇ-ప్రోక్యూర్మెంట్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో వేగంగా ఎదుగుతోంది. ఇప్పుడు సంస్థ విస్తరణ ప్రణాళికల నిమిత్తం మేనేజ్మెట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 37 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
Operations, Systems, Personnel & Administration, Law, Finance & Accounts వంటి విభాగాల్లో పోస్టులు ఉండటం వల్ల, వేర్వేరు విద్యార్హతలున్న అభ్యర్థులకు అప్లై చేసే అవకాశం ఉంది. ట్రైనింగ్ పూర్తయ్యాక Assistant Manager (E1 Grade) గా నియమిస్తారు. అలాగే ₹14.50 లక్షల వరకు CTC లభిస్తుంది. అప్లికేషన్లు 15 నవంబర్ 2025 నుండి ప్రారంభమవుతాయి. అభ్యర్థులు నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తులు పెట్టుకోవచ్చ.

ఖాళీల వివరాలు
మొత్తం పోస్టులు: 37
A) General Cadre — 14 Posts
- Systems – 7 Posts
సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్, డేటాబేస్, IT ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా టెక్నికల్ ఆపరేషన్లకు సంబంధించిన పని. - Operations – 4 Posts
ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్, ప్రోక్యూర్మెంట్, బిజినెస్ ఆపరేషన్స్ నిర్వహణలో కీలక బాధ్యతలు. - Personnel & Administration – 2 Posts
HR, అడ్మినిస్ట్రేషన్, సిబ్బంది నిర్వహణకు సంబంధించిన కార్యాచరణ. - Law – 1 Post
లీగల్ డాక్యుమెంటేషన్, కేస్ హ్యాండ్లింగ్, ఒప్పందాల పరిశీలన వంటి పనులు.
B) Finance Cadre — 23 Posts
- Finance & Accounts – 23 Posts
ఆడిట్, అకౌంట్స్, ఫైనాన్స్ మేనేజ్‌మెంట్, కంప్లైయెన్స్, టాక్సేషన్‌కు సంబంధించిన బాధ్యతలు.
Also Read : SAIL Management Trainee Recruitment 2025 | స్టీల్ తయరీ సంస్థలో బంపర్ జాబ్స్
అర్హతలు (Eligibility Criteria)
General Cadre
- Systems: BE/B.Tech in Electronics/IT/Computer Science OR MCA with 60% marks
- Operations: Degree/PG in Humanities/Science/Commerce/Engineering/Law/IT/Business Admin (60%)
- Personnel & Admin: Degree/PG — HR/IR/Personnel Mgmt కు ప్రాధాన్యం
- Law: LLB/LLM with 60% marks
Finance Cadre
- CA / CMA OR MBA (Finance)
వయోపరిమితి (As on 31-10-2025)
MSTC Management Trainee Recruitment 2025 అభ్యర్థులకు 31-10-2025 నాటికి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది.
జీతం (Salary Details)
MSTC Management Trainee Recruitment 2025 ఎంపికైనే అభ్యర్థులకు ₹50,000 – 1,60,000/- (E1 Grade) వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.
- 1 సంవత్సరం ట్రైనింగ్
- తరువాత Assistant Manager (E1 Grade) గా నియామకం
- కనీసం 5 సంవత్సరాల బాండ్ తప్పనిసరి
ఎంపిక విధానం (Selection Process)
MSTC Management Trainee Recruitment 2025 అభ్యర్థుల ఎంపిక కింది దశల్లో జరుగుతుంది.
- కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) (120 Marks)
- గ్రూప్ డిస్కషన్ (GD)
- ఇంటర్వ్యూ
Also Read : CWC Recruitment 2025 | సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్
అప్లికేషన్ ఫీజు
MSTC Management Trainee Recruitment 2025 అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- జనరల్ / OBC / EWS : ₹500 + GST
- SC / ST / PwBD : ఫీజు లేదు
Apply చేయడం ఎలా? (How to Apply)
- www.mstcindia.co.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
- “Apply Online” క్లిక్ చేయాలి.
- కొత్త రిజిస్ట్రేషన్ చేయాలి.
- ఫోటో, సంతకం, thumb impression and declaration upload చేయాలి.
- ఫీజు చెల్లించాలి.
- అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తులు ప్రారంభం: 15-11-2025
- దరఖాస్తులకు చివరి తేదీ: 30-11-2025
| Notification | Click here |
| Apply Online | Click here |






