RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు

On: October 31, 2025
RRB JE Recruitment 2025

RRB JE Recruitment 2025 : భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) మరోసారి దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్ అభ్యర్థులకు బంపర్ అవకాశం అందిస్తోంది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ వంటి వివిధ టెక్నికల్ పోస్టులను భారీ స్థాయిలో భర్తీ చేస్తోంది. మొత్తం 2,569 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

భారత రైల్వేలో ఇంజనీరింగ్ ఉద్యోగం అనేది కేవలం ఉద్యోగం కాదు — అది భద్రమైన భవిష్యత్తు, స్థిరమైన జీతం మరియు ప్రతిష్టాత్మకమైన కెరీర్ వైపు అడుగు. టెక్నికల్ అర్హతలు ఉన్న యువతీ యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటే, దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థలో భాగమయ్యే అవకాశం పొందవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస అర్హత, వయోపరిమితి, ఫీజు, ఎంపిక విధానం, జీతం మరియు దరఖాస్తు వివరాలు క్రింద స్పష్టంగా ఇవ్వబడ్డాయి.

RRB JE Recruitment 2025
RRB JE Recruitment 2025

ఖాళీల వివరాలు (Vacancy Details) : 

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,569 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

పోస్టుల పేర్లు : 

  • జూనియర్ ఇంజనీర్
  • డిపో మెటీరియల్ సూపరింటెండెంట్
  • కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్

మొత్తం పోస్టుల సంఖ్య : 2,569

Also Read : NHAI Recruitment 2025 | నేషనల్ హైవేస్ లో బంపర్ జాబ్స్

అర్హతలు(Eligibility) : 

RRB JE Recruitment 2025 అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ / సంస్థ నుంచి సంబధిత విభాగంలో ఇంజనీరింగ్ లో డిగ్రీ / డిప్లొమా కలిగి ఉండాలి. 

  • జూనియర్ ఇంజనీర్(JE): అభ్యర్థులు Civil, Mechanical, Electrical, Electronics, Computer Science, Information Technology, Communication / Instrumentation, Mechatronics / Industrial / Production / Automobile ఇంజనీరింగ్ విభాగాల్లో Diploma లేదా Degree in Engineering పూర్తిచేసి ఉండాలి.
  • డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Engineering Degree (ఏ విభాగంలోనైనా) లేదా Diploma in Engineering (with relevant technical background).
  • కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ : అభ్యర్థి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి Bachelor’s Degree in Science (B.Sc) with Physics & Chemistry తప్పనిసరిగా ఉండాలి.

వయోపరిమితి(Age Limit) :  

RRB JE Recruitment 2025 అభ్యర్థులకు 01.01.2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు(Application Fees) : 

RRB JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. 

కేటగిరీఅప్లికేషన్ ఫీజు
జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్రూ.500/- (ఇందులో ₹400 రీఫండ్ అవుతుంది CBT పరీక్ష రాసిన తర్వాత)
ఎస్సీ / ఎస్టీ / పీడబ్ల్యూబీడీ / ఈఎస్ఎమ్ / మహిళలురూ.250/-(CBT పరీక్ష రాసిన తర్వాత రీఫండ్)

ఎంపిక ప్రక్రియ (Selection Process):

RRB JE Recruitment 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఎంపిక నాలుగు దశల్లో జరుగుతుంది. 

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-I)
  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష(CBT-II)
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

Also Read : SEBI Grade A Recruitment 2025 | సెబీలో రూ.1.30 లక్షల జీతంతో ఉద్యోగాలు

జీతం వివరాలు(Salary) :

RRB JE Recruitment 2025 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం ఇవ్వడం జరుగుతుంది. అభ్యర్థులకు లెవల్-6 ప్రకారం రూ.35,400 – రూ.1,12,400/- వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం (How to Apply):

RRB JE Recruitment 2025 అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. 

  • అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ని సందర్శించాలి. 
  • అప్లయ్ ఆన్ లైన్ పై క్లిక్ చేయాలి. 
  • రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి. 
  • లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫారమ్ లో వివరాలు జాగ్రత్తగా నింపాలి. 
  • అవసరమైన డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేయాలి. 
  • ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు చెల్లించి, దరఖాస్తు సబ్మిట్ చేయాలి. 

ముఖ్యమైన తేదీలు : 

  • దరఖాస్తు ప్రారంభ తేదీ : 31 అక్టోబర్, 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ : 30 నవంబర్, 2025
NotificationClick Here
Apply OnlineClick here

Also Read : NEEPCO Executive Trainee Recruitment 2025 | విద్యుత్ సంస్థలో నెలకు రూ.లక్ష జీతంతో ఉద్యోగాలు

1 thought on “RRB JE Recruitment 2025 | రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ – 2,569 JE పోస్టులు”

Leave a Reply to Nunnanagesh Cancel reply

Follow Google News